జోరు చూపిస్తున్న క్యారెక్టర్ ఆర్టిస్టు
విభాగం: సినిమా వార్తలు
prakash-raj-movie-offers-in-telugu-film-industry_g2d

ఒకప్పుడు తెలుగులో పది పెద్ద సినిమాలు తెరకెక్కుతుంటే.. అందులో ఆరేడు సినిమాల్లో ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించేవాళ్లు. బహు భాషా నటుడైన ఆయన.. తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేశారు. విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇక్కడ వందల సినిమాలు చేశారాయన. రెండు దశాబ్దాల పాటు తీరిక లేకుండా నటించిన ఆయనకు అనుకోకుండా గ్యాప్ వచ్చేసింది. గత నాలుగైదేళ్లుగా ఆయనకు తెలుగులో సినిమాలు బాగా తగ్గిపోయాయి. నెమ్మదిగా ఆయన తెరమరుగైపోతూ వచ్చారు. 

ఒకసారి ఇలా డౌన్ అయిన నటుడిని మళ్లీ పట్టించుకోవడం తక్కువే. నెమ్మదిగా రచయితలు - దర్శకుల ఆలోచనల్లోంచి ఆ నటుడు వెళ్లిపోతాడు. కెరీర్ ముగిసిపోతుంటుంది. అలా చరిత్రలో కలిసిపోయిన ఆర్టిస్టులు ఎంతమందో. ప్రకాష్ రాజ్ పరిస్థితి కూడా అంతే అని.. ఆయన పనైపోయిందని తీర్మానించేశారు అందరూ. ప్రకాష్ రాజ్ కూడా రాజకీయాలతో ముడిపడ్డ చర్చా కార్యక్రమాలు.. సేవా కార్యక్రమాలతో బిజీ అయిపోయినట్లు కనిపించాడు. కానీ టాలీవుడ్లో ఈ మధ్య మళ్లీ ప్రకాష్ రాజ్ జోరు కనిపిస్తోంది.

ఇటీవలే ‘భరత్ అనే నేను’లో విలన్ పాత్రలో మెరిశారు ప్రకాష్ రాజ్. ఈ సినిమాతో తనేంటో మళ్లీ ఆయన రుజువు చేసుకున్నారు. దీని తర్వాత మహేష్ నటిస్తున్న కొత్త సినిమాలోనూ ప్రకాష్ రాజ్కు కీలక పాత్ర దక్కింది. మరోవైపు దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న రెండు సినిమాల్లో ఆయన నటిస్తున్నారు. ‘శ్రీనివాస కళ్యాణం’.. ‘హలో గురూ ప్రేమ కోసమే’.. ఈ రెండు సినిమాల్లోనూ ఆయనది ముఖ్య పాత్ర అట. ఇవి కాక ఇంకో రెండు మూడు సినిమాలు ఆయన చేతిలో ఉన్నాయి. ఇవన్నీ బాగా ఆడితే ప్రకాష్ రాజ్ మళ్లీ పూర్వపు ఫామ్ అందుకున్నట్లే

 

SOURCE:TUPAKI.COM

14 Jul, 2018 0 354
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved