బావ కళ్లల్లో ఆనందం చూడాలనుకుంటున్నాడు
విభాగం: సినిమా వార్తలు
ram-charan-comments-on-vijetha-trailer_g2d

ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి అరడజను వరకు హీరోలు ఉన్నారు. చిరంజీవి, నాగబాబు, పవన్‌కళ్యాణ్‌, రామ్‌చరణ్‌, అల్లుఅర్జున్‌, అల్లుశిరీష్‌, వరుణ్‌తేజ్‌, సాయిధరమ్‌తేజ్‌లు హీరోలుగా చేసిన చేస్తున్న వారే. ఇక మరికొన్ని రోజుల్లో చిరంజీవి చిన్నల్లుడు, శ్రీజ రెండో భర్త కళ్యాణ్‌దేవ్‌ హీరోగా తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. ఈ చిత్రం జులై 12న భారీగా విడుదలకు సిద్దమవుతోంది. సినిమాని సాయి కొర్రపాటి తన వారాహి చలనచిత్రం పతాకంపై మెగాస్టార్‌ చిరంజీవి కోరికపై పెద్దగా అంచనాలు లేకుండా నిర్మించేశాడు. ఒకే ఒక్క సినిమా అనుభవం ఉన్న, మొదటి చిత్రం కూడా పెద్దగా హిట్‌ లేని రాకేష్‌శశి దీనికి డైరెక్టర్‌. మెగాస్టార్‌ చిరంజీవిని ఫ్యామిలీ ఆడియన్స్‌కు, మహిళా ప్రేక్షకులకు దగ్గర చేసిన 'విజేత' టైటిల్‌తోనే ఈ తండ్రీ కొడుకుల సెంటిమెంట్‌ మీద తీసిన చిత్రం విడుదలకానుంది. 

అదే సమయంలో వరుసగా ఐదు ఫ్లాప్‌లతో డీలా పడ్డ మెగామేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌ ఎన్నో ఆశలతో చేసిన మొదటి ప్యూర్‌ లవ్‌స్టోరీ 'తేజ్‌ ఐ లవ్‌యు' చిత్రానికి దీనికి ఓ వారం ముందు అంటే 6వ తేదీన విడుదల అవుతోంది. ఇక మెగాహీరోల కెరీర్లను తీసుకుంటే వారికి జూలై అనేది బాగా అచ్చివచ్చిన నెలకావడం విశేషం. మరి వారం గ్యాప్‌లో రానున్న 'తేజు ఐలవ్‌యు, విజేత'లలో ఏది విజేతగా నిలుస్తుందో అనే ఆసక్తి పెరుగుతోంది. ఈ రెండు చిత్రాలకు మిగిలిన మెగా కాంపౌండ్‌ హీరోల మద్దతుతో పాటు మెగాభిమానుల మద్దతు కూడా ఉంది. ఇక 'విజేత' విషయానికి వస్తే ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ అంచనాలను మించి అందరినీ ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ని కూడా విడుదల చేశారు. ఈ ట్రైలర్‌కి కూడా అన్ని వర్గాల ప్రేక్షుకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుండటం మెగాకాంపౌండ్‌లో ఆనందాన్ని, అంచనాలను పెంచుతోంది. 

తాజాగా ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా రామ్‌చరణ్‌ ఈ చిత్రం ట్రైలర్‌పై స్పందించాడు. ట్రైలర్‌ చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంది. ఈ సినిమా దర్శక నిర్మాతలకు, బావకు బెస్ట్‌ విషెస్. లుక్స్‌, డ్యాన్స్‌ పరంగా ఇప్పటికే మంచి మార్కులు కొట్టేసిన కళ్యాణ్‌దేవ్‌ నటనపరంగా కూడా మెప్పిస్తాడని ఆశిస్తున్నాను అని అర్ధం వచ్చేలా ట్వీట్‌ చేశాడు. రామ్‌చరణ్‌ చెప్పినట్లు చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్‌దేవ్‌ కూడా నటనలో మార్కులు కొట్టేస్తే ఆయనకు కూడా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పవచ్చు.

 

SOURCE:CINEJOSH.COM

30 Jun, 2018 0 419
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved