బాబాయ్ కోసం అంత చేశావా చెర్రీ
విభాగం: సినిమా వార్తలు
ram-charan-shares-a-surprise-video-to-pawan-kalyan_g2d

బాబాయ్ బర్త్ డేకి సర్ ప్రైజ్ ఇస్తానని అన్నప్పుడే అభిమానులకు ఏదో సందేహం కలిగింది. పైగా రామ్ చరణ్ ఆ వ్యాన్ లో వెళుతున్న ప్రదేశం ఉత్కంఠ రేకెత్తించింది. చెర్రీ ఏంటి స్పెషల్ గెటప్పులో కనిపిస్తున్నాడు. అదేదో హిల్ ఏరియా.. మైనింగ్ ఏరియాలా ఉందే! అసలింతకీ ఎక్కడికి వెళుతున్నాడు? ఇలా పరిపరివిధాల మెగాభిమానుల ఆలోచనలు సాగాయి. బాబోయ్ బాబాయ్ కోసం చెర్రీ ఏదో చేసేస్తున్నాడనే అనుకున్నారు. అసలింతకీ ఏం చేస్తున్నాడో అంటూ బుర్ర గోక్కున్నారు.

మొత్తానికి చెర్రీ అన్నంత పనీ చేశాడు. బాబాయ్ కోసం చాలా పెద్ద సాహసమే చేశాడు. తనకు బర్త్ డే విషెస్ మామూలుగా చెబితే కిక్కేం ఉంటుందని భావించి ఏకంగా పారా గ్లైడింగ్ చేసి విషెస్ తెలిపాడు. దీనికి పవన్ బాబాయ్ స్ఫూర్తి! అని తన ప్రేమను చాటుకున్నాడు. ఇలాంటి డేరింగ్ ఫీట్స్ చేయాలంటే పవన్ బాబాయ్ ప్రేరణ అని తెలిపాడు. ఆ మేరకు ఓ వీడియోని ఫేస్ బుక్ లో చెర్రీ పోస్ట్ చేయడంతో మెగాభిమానుల్లో ఈ వీడియో జోరుగా వైరల్ అవుతోంది.

వీడియో చిన్నదే కానీ ఇన్ స్పయిరింగ్! అంటూ మెచ్చుకుంటున్నారు. పారా గ్లైడింగ్ వేళ చరణ్ అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. తలకు - బాడీ మొత్తం రక్షకవచం ధరించి ఉంది. ఇంతకీ ఈ సాహసకృత్యం ఎక్కడినుంచో తెలియలేదు. ఇకపోతే చరణ్ ప్రస్తుతం బోయపాటి కాంబినేషన్ మూవీ కోసం ఎవరూ చేరుకోలేని ఓ అరుదైన లొకేషన్ కి వెళుతున్నాడు. అదే యూరప్ లోని అజెర్ భైజాన్ ఏరియా. అక్కడ ఎగ్జోటిక్ లొకేషన్లలో ఆర్ సి 12 షూటింగ్ చేస్తారుట. అక్కడికి వెళ్లే ముందే ఇలా అడ్వెంచర్ స్పోర్ట్స్ తో చరణ్ ఆకట్టుకున్నారు. మొత్తానికి ఈరోజు తన సినిమా టైటిల్ ప్రకటిస్తాడేమో అనుకున్నవారికి ఓ రకంగా షాకిచ్చాడిలా సాహసాలతో!

 

 

 

SOURCE:TUPAKI.COM

02 Sep, 2018 0 339
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved