రానా ఈ ఏడాది ఆఖరు వరకు ఏ తెలుగు సినిమాకూ ఓకే చెప్పే అవకాశం లేదు
విభాగం: సినిమా వార్తలు
rana-is-not-going-to-tell-any-telugu-movie-till-the-end-of-this-year_g2d

బాహుబలి సినిమాలో భళ్లాలదేవుడి పాత్రతో తన సత్తా చాటుకున్నాడు హీరో రానా. తెలుగులోనే కాకుండా బాలీవుడ్.. కోలీవుడ్ లో సైతం వరసగా సినిమాలు చేస్తూ బహుభాషా నటుడిగా బహు బాగా పేరు సంపాదించుకున్నాడు. ఘాజీ సినిమాతో మరోసారి బాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించాడు. 

రానా చివరగా తెలుగు డైరెక్ట్ గా నేనే రాజు.. నేనే మంత్రి సినిమాలో నటించాడు. ఆ తరువాత ఇంతవరకు ఏ సినిమాకూ ఓకే చెప్పలేదు. ప్రస్తుతం రానా కంటి సర్జరీ చేయించుకున్నాడు. దీంతో కొన్నాళ్లకు షూటింగ్ కు విరామం ఇవ్వక తప్పని పరిస్థితి. సర్జరీ కోసం డాక్టర్ల సూచన మేరకు లో సోడియం డైట్ తీసుకోవడంతో బాగా బరువు తగ్గిపోయాడట. చికిత్సలో భాగంగా త్వరలో సింగపూర్ బయలుదేరి వెళ్లనున్నాడు. అక్కడి నుంచి తిరిగొచ్చాక కూడా కొన్నాళ్లు బెడ్ రెస్ట్ లో ఉండే అవకాశం ఉంది. 

సురేష్ ప్రొడక్షన్స్ తో కలిసి పెళ్లిచూపులు - ఈ నగరానికి ఏమైంది సినిమాలు తీసిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తన మూడో సినిమా రానాతో తీయాలని వెయిటింగ్ లో ఉన్నాడు. మరోవైపు గుణశేఖర్ కూడా భారీ బడ్జెట్ తో ఓ పౌరాణిక చిత్రం ప్లాన్ చేసి రెడీగా ఉన్నాడు. వీళ్లిద్దరూ రానా డేట్స్ ఎప్పుడు దొరుకుతాయా అని ఎదురుచూస్తున్నారు. కానీ ఈ ఏడాది ఆఖరు వరకు ఏ తెలుగు సినిమాకూ ఓకే చెప్పే అవకాశం లేదని అతడి సన్నిహితులు చెబుతున్నారు. ఒకవేళ షూటింగ్ కు వెళ్లినా ఇప్పటికే మొదలెట్టని హాథీమేరీ సాథీ కంప్లీట్ చేస్తాడట. సో.. రానా కోసం స్టోరీ రెడీ చేసుకున్న డైరెక్టర్లు కొత్త సంవత్సరం వరకు ఎదురుచూడాల్సిందే

 

SOURCE:GULTE.COM

26 Jul, 2018 0 346
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved