జ‌గ‌న్ మీద ప‌వ‌న్ కు కోపం వెనుక కార‌ణం ఇదేన‌ట‌!
విభాగం: రాజకీయ వార్తలు
reason-behind-pawan-anger-on-jagan_g2d

ఓవైపు త‌న‌కు త‌గ్గట్లు ట‌ర్మ్స్ ను డిక్టేట్ చేస్తూ.. మ‌రోవైపు నీతులు వ‌ల్లించే అద్భుత‌మైన టాలెంట్ జ‌న‌సేనాధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ సొంతం. ప‌ట్టుమ‌ని ప‌ది రోజులు వ‌రుస పెట్టి ప‌ని చేసేందుకు వంద ఆలోచించే ప‌వ‌న్ క‌ల్యాణ్ తీరు గురించి తెలుగు ప్ర‌జ‌ల‌కు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు.

మొద‌ట్నించి జ‌గ‌న్ అంటే ఇట్టే ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసే ప‌వ‌న్‌.. ఏపీ విప‌క్ష నేత అంటే ఎందుకంత కోప‌మ‌న్న విష‌యంపై ఇప్ప‌టివ‌ర‌కూ క్లారిటీ ఇచ్చింది లేదు. తాజాగా ఆ లోటును తీరుస్తూ జ‌గ‌న్ మీద త‌న‌కెందుకంత కోప‌మ‌న్న విష‌యాన్ని రివీల్ చేశారు.

ఇప్ప‌టివ‌ర‌కూ త‌న గుండెల్లో గుట్టుగా దాచుకున్న నిజాన్ని ప‌వ‌న్ తాజాగా నిర్వ‌హించిన క‌వాతు బ‌హిరంగ స‌భ‌లో వెల్ల‌డించారు. వైఎస్ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో (సుమారు 2006)  త‌న గ‌దిలోకి ఒక వ్య‌క్తి డోర్ నెట్టేసుకొని వ‌చ్చేశాడ‌ని.. త‌న‌ను సినిమా చేయాల‌ని కోరాడ‌న్నారు.

ఆ స‌మ‌యంలో జ‌గ‌న్ పేరును ప్ర‌స్తావించార‌న్నారు. త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్‌.. కోట్లాది మంది ప్ర‌జ‌ల అభిమానం ఉన్న త‌న‌పైనే అంత ఒత్తిడి తీసుకురావ‌టం త‌న‌కు నచ్చ‌లేద‌న్నారు. త‌నలాంటి వ్య‌క్తినే ఇలా చేస్తే.. మిగిలిన సామాన్యుల సంగ‌తేంటి? అన్న ప్ర‌శ్న‌ను ప‌వ‌న్ సంధించారు. అందుకే.. త‌న‌కు జ‌గ‌న్ తీరును త‌ప్పు ప‌డ‌తామ‌న్న మాట‌ను చెప్పారు. 

త‌న తండ్రి ముఖ్య‌మంత్రి కాబ‌ట్టి.. తాను ముఖ్య‌మంత్రి అవ్వాల‌న్న జ‌గ‌న్ ఆలోచ‌న స‌రికాద‌న్న ప‌వ‌న్‌.. కానిస్టేబుల్ కొడుకు ముఖ్య‌మంత్రి కాకూడ‌దా? అంటూ ప్ర‌శ్నించారు. జ‌గ‌న్ మీద త‌న‌కు ఎలాంటి కోపం లేదంటూనే.. జ‌గ‌న్ కార‌ణంగా తన‌కు ఎదురైన అనుభ‌వాన్ని తొలిసారి రివీల్ చేశారు. మొత్తానికి జ‌గ‌న్ మీద ప‌వ‌న్ త‌ర‌చూ ఎందుకు త‌ప్పు ప‌డ‌తార‌న్న అంశంపై ప‌వ‌న్ స‌మాధానం పలు సందేహాల‌కు క్లారిటీ ఇచ్చేలా ఉందని చెప్ప‌క త‌ప్ప‌దు.

 

 

 

SOURCE:GULTE.COM

16 Oct, 2018 0 362
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ 2022 galli2delhi.com All Rights Reserved
@ 2022 galli2delhi.com All Rights Reserved