రెచ్చిపోయిన రెజీనా.. కాసులు రాలతాయా?
విభాగం: సినిమా వార్తలు
regina-hot-song_g2d

వరుస ఫ్లాప్‌లకి తోడు ఈమధ్య పర్సనల్‌ ఇమేజ్‌ డ్యామేజ్‌ అయ్యేలా కొన్ని వదంతులు చుట్టుముడుతోన్న టైమ్‌లో రెజీనాకి ఇప్పుడు బ్రేక్‌ చాలా అవసరం. తెలుగులో ఆమె చేతిలో చెప్పుకోతగ్గ సినిమాలేమీ లేవు. ఇప్పటికే ఐరెన్‌లెగ్‌ అనే ముద్ర వేసేసి ఆమెకి ఛాన్సులివ్వడం లేదు. దీంతో మరో పది రోజుల్లో విడుదల కానున్న తమిళ చిత్రం 'మిస్టర్‌ చంద్రమౌళి' మీదే ఆమె ఆశలన్నీ పెట్టుకుంది. కార్తీక్‌, గౌతమ్‌ కార్తీక్‌ కలిసి నటించిన ఈ చిత్రంలోని ఒక హాట్‌ సాంగ్‌ యూట్యూబ్‌లో హల్‌చల్‌ చేస్తోంది.

సముద్ర తీరాన గౌతమ్‌ కార్తీక్‌తో కలిసి రెజీనా రెచ్చిపోయిన విధానానికి ఈ వీడియో వైరల్‌ అయింది. యూట్యూబ్‌లో మూడు మిలియన్లకి పైగా వ్యూస్‌తో పాటు విపరీతంగా మీడియా కవరేజ్‌ కూడా దక్కించుకుంది. ఈ చిత్రాన్ని అంతకుముందు పట్టించుకోని వారు కూడా రెజీనా సాంగ్‌ వల్ల దీనిని గుర్తించారు. సినిమాకి పబ్లిసిటీ బాగా వచ్చింది కనుక వసూళ్లు కూడా వస్తాయని చిత్ర బృందంతో పాటు రెజీనా కూడా ఆశిస్తోంది. అయితే ఒక్క పాటతో కాసులు రాలిపోతాయనే గ్యారెంటీ లేదు.

స్టార్టింగ్‌ ట్రబుల్‌ లేకుండా డీసెంట్‌ ఓపెనింగ్‌కి ఈ వీడియో పనికొస్తుంది. అయితే సక్సెస్‌ అయ్యే స్టఫ్‌ సినిమాలో వుందా లేదా అనేది వేచి చూడాలి. ఈ సినిమా కూడా మిస్‌ఫైర్‌ అయితే మాత్రం రెజీనాకి ఇక హోప్స్‌ పెట్టుకోవడానికి కూడా సరయిన సినిమాలు చేతిలో వుండవు. పరాజయాలకి తోడు తన పేరు స్కాండల్స్‌లో వినిపిస్తోన్న టైమ్‌లో సక్సెస్‌తో సమాధానం చెప్పడం రెజీనాకి చాలా అవసరం. మిస్టర్‌ చంద్రమౌళి ఏం చేస్తాడో ఏమో మరి?

29 Jun, 2018 0 735
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ 2022 galli2delhi.com All Rights Reserved
@ 2022 galli2delhi.com All Rights Reserved