రేణు... ఇది నిజమేనా
విభాగం: సినిమా వార్తలు
renu-...-this-is-true_g2d

రెండో పెళ్లి కోసం చేసుకొన్న నిశ్చితార్థం... పవన్ కళ్యాణ్ అభిమానుల ట్విట్టర్ బెదిరింపులకు సంబంధించిన  విషయంలో  మొన్నటిదాకా  వార్తల్లో నిలిచింది రేణుదేశాయ్. తాజాగా ఆమె గురించి మరో న్యూస్ సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతోంది. అందులో నిజమెంతన్నది తెలియాలంటే రేణుదేశాయే స్పందించాలి. ఇంతకీ ఆ న్యూస్ ఏంటంటే ... రేణుదేశాయ్ త్వరలోనే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతోందన్నదే! ఒకప్పుడు కథానాయికగా తెరపై మెరిసింది రేణు. ఆ తర్వాత స్టైలిష్ట్ గా పవన్ నటించిన పలు చిత్రాలకి పనిచేసింది. పవన్ నుంచి విడిపోయాక ఆమె దర్శకత్వం కూడా చేసింది. నిర్మాణంలో కూడా పాలు పంచుకొంది.

ఈ మధ్యలో నటిగా తెలుగు నుంచి పలు అవకాశాలొచ్చినా ఆమె చేయడానికి అంగీకరించలేదట. ఒక టీవీ కార్యక్రమానికి మాత్రం జడ్జిగా వ్యవహరించింది. అయితే ఇటీవల రేణుదేశాయ్  తన మనసు మార్చుకొని సినిమాల్లో నటించడానికి అంగీకారం తెలిపిందని - ఒక తెలుగు సినిమాకి సైన్ కూడా చేసిందని ప్రచారం సాగుతోంది. మరి అందులో నిజమెంతో  రేణూనే చెప్పాలి. రెండో పెళ్లి కోసం చేసుకున్న నిశ్చితార్థం తర్వాత బెదిరింపులొస్తున్నాయని - ప్రశాంతత కోసం ట్విట్టర్ నుంచి బయటికి వెళుతున్నానని రేణుదేశాయ్ తన  అకౌంట్ ని కూడా తీసేసింది. తనని పెళ్లాడబోయే వ్యక్తి ఫొటోని కూడా బయట పెట్టకుండా గోప్యత పాటిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆమె తెలుగులో సినిమా చేయడానికి ఒప్పుకుంటుందా అనేది సందేహమే. ఒకవేళ నటించే ఉద్దేశం ఉన్నా పెళ్లి తర్వాతే నటించొచ్చని కొంతమంది అంటున్నారు

 

SOURCE:TUPAKI.COM

23 Jul, 2018 0 253
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved