రేణు దేశాయ్ ఇంటర్వూ
విభాగం: సినిమా వార్తలు
renu-desai-interview_g2d

మొత్తానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య తనంతట తానే నోరు విప్పారు. తనంతట తానే ఇంటర్వూ అరేంజ్ చేసుకుని, తన యూ ట్యూబ్ చానెళ్లో లోడ్ చేసారు. 

ఆమె తన యూట్యూబ్ చానెల్ లో పెట్టుకున్నారు కాబట్టి ఇది ఆమె కోరి అరేంజ్ చేసుకున్న చిట్ చాట్ అని కూడా స్పష్టం అవుతోంది. అదే సమయంలో ఆమె ఈ చిట్ చిట్ లో ఓ విషయం క్లారిటీగా చెప్పారు.

తను చేసుకోబోయే వ్యక్తి, తను ఎంటర్ కాబోయే కొత్త కుటుంబం కోరిక మేరకు ఇప్పుడు అన్ని విషయాలు బయట పెడుతున్నట్లు వెల్లడించారు.

తనను చేసుకోబోయేవారు, తనను స్వాగతించే కుటుంబం తన గతం గురించి అంతా తెలుసుకునే ఓకె అన్నారని చెబుతూనే, మరి అలాంటపుడు, నీ తప్పు లేనపుడు ఓపెన్ గా చెప్పవచ్చు కదా అని అన్నారని రేణు దేశాయ్ అన్నారు. ఈ విషయాన్ని ఒకటికి రెండు సార్లు చెప్పడం విశేషం.

అంటే రేణు ఓపెన్ అప్ అవ్వడం అన్నది ఆమె ఇష్టం ప్రకారం జరిగినట్లు కాకుండా, చేసుకోబోయే భర్త, అత్తింటి వారి వత్తిడి లేదా సలహా కారణంగా జరిగినట్లు కనిపిస్తోంది.

ఒక పక్క రాజకీయాల్లో వున్నపుడు ఇలా మాట్లాడితే, పొలిటికల్ గా వస్తుందని తాను భావిస్తూ వచ్చానని అంటూనే, మళ్లీ అన్నీ వివరంగా చెపుతూ రావడం అంటే కాస్త చిత్రంగానే వుంది.

అయినా రేణు గతం పూర్తిగా తెరచిన పుస్తకమే. పోనీ తెరవెనుక జరిగిన విషయాలు ఆమె ద్వారా తెలుసుకుని కూడా, మళ్లీ వాటిని బహిరంగంగా చెప్పమని, రేణు దేశాయ్ ను చేసుకోబోయే భర్త, ఆమెను స్వాగతించే కుటుంబం ప్రభావం, ప్రోద్బలం, ప్రోత్సాహం,ఇంకా చెప్పాలంటే వత్తిడి ఎక్కువగా వుందని అనిపిస్తోంది.

తామెవరో, తమ కుటుంబం ఏమిటో బయటకు రాకుండానే, తెరవెనుకే వుంటూ, రేణు దేశాయ్ ను మాత్రం తెరముందుకు తీసుకువచ్చారు. ఇదంతా ఏమిటో? ఎందుకో?

సోషల్ భూతం

రేణుదేశాయ్ చదువుకున్న వ్యక్తి. ప్రపంచం తెలిసిన వ్యక్తి. ఆధునిక టెక్నాలజీ మీద అవగాహన వున్న వ్యక్తి. అలాంటి వ్యక్తికి సోషల్ మీడియాలో ఫేక్ అక్కౌంట్ల గురించి తెలియదా? ట్విట్టర్ లో కావచ్చు, ఫేస్ బుక్ లో కావచ్చు ఆడ పేరు వుంటే ఆడవాళ్లే అనుకుని, ఆడవాళ్లే తనను తిట్టారని అనుకుంటే అంతకన్నా అమాయకత్వం మరోటి వుండదు.

పవన్ ఫ్యాన్ అని పేరు పెట్టినా, పవన్ ఫొటో పెట్టినా పవన్ అభిమానులే అనుకుంటే అంతకన్నా మించిన అమాయకత్వం మరొటి వుండదు.

పవన్ ఫ్యాన్స్ పేరుతో ఎవరైనా ఫేక్ ఐడి లు పెట్టుకుని, తనను ఈ విధంగా రెచ్చగొట్టారని ఎందుకు అర్థం చేసుకోలేదు. మొత్తం మీద సోషల్ మీడియా ఫేక్ అక్కౌంట్ల ద్వారానో? లేదా కొత్త కుంటుంబం వత్తిడి ద్వారానో, రేణు దేశాయ్ కొన్ని విషయాలు క్లియర్ చేసారు.

విడాకులు పవన్ నే అడిగారు

తను వుండగానే వేరోకరితో బిడ్డను కనడం పవన్ చేసిన తప్పు

తన పిల్లలు కాబోయే కొత్త భర్తకు బాగా దగ్గరయిపోయారు.

ఈ మూడూ కీలకం. నిజానికి ఈ మూడు విషయాలు వెల్లడించడం ద్వారా లోకానికి రేణు దేశాయ్ చెప్పాల్సినవి కూడా మూడే.

ఈ టోటల్ ఎపిసోడ్ లో తన తప్పు లేదు. పవన్ నే అడిగారు. పవన్ నే తప్పు చేసారు అన్నవి రెండు. ఇద్దరు పిల్లలు వున్నారు. వాళ్లు హ్యాపీనే అన్నదే

 

SOURCE:GREATANDHRA.COM

08 Jul, 2018 0 353
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved