అమరావతి: లాడ్జిలో అడ్డంగా దొరికిన జంట.. మహిళపై ఎస్ఐ అఘాయిత్యం
విభాగం: రాజకీయ వార్తలు
sexual-harassment-on-woman-in-amaravati_g2d

ఏకాంతంగా గడిపేందుకు అమరావతిలోని ఓ లాడ్జికి వెళ్లిన జంటపై ఎస్ఐ రామాంజనేయులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. రూ.10వేల లంచం ఇవ్వకపోతే వ్యభిచారం కేసు పెడతానని బెదిరించారు.

మహిళకు రక్షణగా నిలవాల్సిన ఓ పోలీసు అధికారి కీచకుడిగా మారిన ఘటన ఇది. తన కర్తవ్యాన్ని మరిచి మహిళ వద్ద డబ్బులు దోచుకోవడంతో పాటు ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. ఈ ఘటనపై బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు శాఖాపరంగా అంతర్గత విచారణ చేపట్టారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌‌లోని అమరావతిలో తీవ్ర కలకలం రేపుతోంది. గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలానికి చెందిన ఓ జంట ఏకాంతంగా గడిపేందుకు సోమవారం అమరావతిలోని ఓ ప్రైవేటు లాడ్జిలో దిగారు. ఈ విషయం తెలుసుకున్న అమరావతి ఎస్సై రామాంజనేయులు తన వ్యక్తిగత వాహనంలో డ్రైవర్‌ సాయికృష్ణతో కలిసి లాడ్జికి వెళ్లారు. వ్యభిచారం కేసు నమోదు చేస్తానని ఆ జంటను బెదిరించి రూ.10 వేల లంచం డిమాండ్‌ చేశాడు.
దీంతో బెదిరిపోయిన జంట తమ వద్ద రూ.5వేలే ఉన్నాయని అవే తీసుకోవాలని కోరారు. క్యాష్ రూ.3వేలు ఇవ్వగా.. మరో రూ.2వేలు డ్రా చేసేందుకు ఎస్ఐ తన డ్రైవర్‌ సాయికృష్ణతో కలిసి ప్రియుడిని ఏటీఎం వద్దకు పంపాడు. ఆ సమయంలో ఒంటరిగా ఉన్న మహిళ పట్ల ఎస్ఐ రామాంజనేయులు అసభ్యంగా ప్రవర్తించాడు. తన కోరిక తీరిస్తే కేసు లేకుండా చేస్తానని ఆమెను బెదిరించాడు. ఆమెను లొంగదీసుకునేందుకు శతవిధాలా ప్రయత్నించాడు. కాసేపటి తర్వాత ప్రియుడు అక్కడి వచ్చిన తర్వాత ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించి ఎస్ఐ వెళ్లిపోయాడు.

ఈ ఘటనపై బాధిత జంట మంగళవారం తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు చేయగా.. ఆయన గుంటూరు రూరల్ ఎస్పీ విజయారావు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అమరావతి ఎస్ఐ రామాంజనేయులుపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఎస్పీ ఆదేశించారు. విచారణ పూర్తయ్యాక ఎస్ఐతో పాటు అతడికి సహకరించిన డ్రైవర్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తుళ్లూరు డీఎస్పీ తెలిపారు.
 

SOURCE : SAMAYAM

 
 
11 Jun, 2020 0 284
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved