శ్రీయ శరణ్ హాట్ పోజ్
విభాగం: సినిమా వార్తలు
shriya-saran-hot-pose_g2d

వన్ ఫైన్ డే రష్యన్ క్రీడాకారుడు ఆండ్రూ కోశ్చీవ్ ని సడెన్ గా పెళ్లాడి పెద్ద షాక్ ఇచ్చింది శ్రీయ శరణ్. ఉన్నట్టుండి తన బోయ్ ఫ్రెండ్ తో పెళ్లి అన్న వార్త రాగానే తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇన్నాళ్లు కెరీర్ కోసం - స్టార్ డమ్ కోసం బడా స్టార్ల వెంట పడిన శ్రీయ ఇక పెళ్లి బంధంతో లైఫ్ లో సెటిలైపోతోందని ఇక టాలీవుడ్ లో కనిపిస్తుందో లేదోనని ఆవేదన అభిమానులు వెల్లగక్కారు. తన ఇలాకా జైపూర్ పరిసరాల్లో సీక్రెట్ గా పెళ్లాడి - ముంబైలో సెలబ్రేషన్స్ చేసుకున్న శ్రీయ - పెళ్లి తర్వాత భర్త ఆండ్రూతో వరుస టూర్లలో బిజీబిజీగా ఉంది. హబ్బీతో కలిసి ప్రపంచ దేశాల్లోని అందాల్ని ఆరాంగా ఎంజాయ్ చేస్తోంది.

ప్రస్తుతం ఈ అమ్మడు ఉక్రెయిన్ ట్రిప్ లో జాలీడేస్ ని ఎంజాయ్ చేస్తోంది. అలా ఎంజాయ్ చేసేప్పుడు తనపై క్లిక్ మన్న ఓ స్నాప్ ని ఇదిగో ఇలా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. పెళ్లయితే స్వేచ్ఛా జీవనానికి అడ్డంకి ఏంటి? అని ప్రశ్నిస్తున్నట్టే ఉందీ ఫోజు. పెళ్లి తర్వాత మునుపటిలానే మస్త్ మజా ఉంటుందిలే! అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బాలయ్య - నాగార్జున - చిరంజీవి - వెంకటేష్ స్టార్లు ఎవరైనా తనకు ఓ ఛాన్సిస్తే టాలీవుడ్ లో నటించేందుకు తాను ఎప్పుడూ సిద్ధమే. ఇకపోతే ఈ భామ యువహీరో శ్రీవిష్ణు `వీరభోగ వసంతరాయలు` చిత్రంలో నటిస్తోంది. ఆ సినిమాలో శ్రీయ గెటప్ ని ఇటీవలే రివీల్ చేసిన సంగతి తెలిసిందే

 

SOURCE:TUPAKI.COM

29 Jul, 2018 0 958
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ 2022 galli2delhi.com All Rights Reserved
@ 2022 galli2delhi.com All Rights Reserved