అనకాపల్లిలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం
విభాగం: రాజకీయ వార్తలు
sri-pawan-kalyan's-speech-at-anakapalli_g2d

జనసేన పోరాటయాత్రలో భాగంగా విశాఖ జిల్లా అనకాపల్లిలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం : 

* అన్నదమ్ములకు, అక్కచెల్లెలందరికి పేరు పేరునా ప్రతీ ఒక్కరికీ హృదయపూర్వక నమస్కారములు.

* నేను మా అన్నయ్యని కాదని ప్రజాశ్రేయస్సు కొరకు వచ్చి తెలుగుదేశానికి మద్దతు తెలిపితే దానికి ప్రతిఫలంగా మీరు తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీని మూసేసారు. 

* పరిశ్రమలు పెడతామని చెప్పి 10 వేల ఎకరాలను సేకరించారు. ఇంకా పరిశ్రమలు మొదలుపెట్టలేదు. భూ దోపిడీ, భూదందాలు చూస్తే నాకు చాలా కోపం, ఆవేదన వచ్చి పోరాటం చెయ్యాలనిపిస్తుంది.

* ఆడపడుచులకు చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి, ఉపాధి సమస్యలు ఉంటాయి, వాటిపై ఎవరు మాట్లాడతారు? నా స్థాయి వ్యక్తి కూడా ప్రజారాజ్యం ఓటమికి భయపడి రాజకీయం మనం చేయలేము అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతే దుర్మార్గులు, దోపీడీదారులు గెలిచిన వారు అవుతారు, వీళ్ళు గెలవకూడదు...

* శత్రువులకు వెన్ను చూపకూడదు, ముందు వుండి వెళ్ళాలి. ప్రజా సమస్యలపై పోరాటం చెయ్యాలి. ప్రజాక్షేత్రంలో వున్న సమస్యలను పరిష్కరించాలి.

* యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తాం అని చెప్పి 10 వేల ఎకరాలు సేకరించి, పరిశ్రమలు పెట్టకుండా వాటిని రియల్ ఎస్టేట్ చేసి ముక్కలు ముక్కలుగా అమ్ముకుంటున్నారు.

* ఇది మీ సొత్తు కాదు, ప్రజల సొత్తు, ఉత్తరాంధ్ర సొత్తు, దేశం సొత్తు అని ముఖ్యమంత్రి గారితో సహా ప్రతి ఒక్క నాయకుడు అర్ధం చేసుకోవాలి.

* ఎమ్మెల్యే గెలిస్తే నూకాలమ్మ తల్లికి కిలో బంగారంతో కిరీటం చేయిస్తా అని చెప్పి, చందాలు వసూలు చేసి చేయించారు. మొక్కు మీదా? దానికి ప్రజలు డబ్బు ఇవ్వాలా? ఆ నూకాలమ్మ తల్లి కళ్ళు తెరిస్తే మీరు ఏమైపోతారో? ఆ తల్లి దీవెనలు మీకు కాదు, ప్రజలకి ఉంటాయి.

* ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదు గాని షుగర్ ఫ్యాక్టరీలు మూసేసి ఉద్యోగాలు తీసేస్తే ఎలాగండి ముఖ్యమంత్రి గారూ? ముఖ్యమంత్రి గారు ఒక ట్రిప్ ఆపితే మన తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ మొదలు అయిపోతుంది. 

* ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మళ్లీ ఎన్నుకోమంటున్నారు. ఎందుకు ప్రజలు మిమ్మల్ని ఎన్నుకోవాలి? జనసేన పార్టీ మీకు ఎందుకు మద్దతు తెలపాలి?

* అవంతి శ్రీనివాసు గారు నాకు పరిచయం వున్న వ్యక్తి, తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ గురించి ఎందుకు మాట్లాడలేదు అని నేను అతనిని అడుగుతున్నా..

* స్థానిక సమస్యలను పట్టించుకోకుండా పారిపోతున్న ఇక్కడ నాయకులకు మేధావులు వలస పక్షులు అని పేరు పెట్టారు.

* మీరు స్థానిక సమస్యలను పట్టించుకోకపోవడం వల్ల వేర్పాటువాద ఉద్యమాలు వస్తే దానికి కారణం తెలుగుదేశం పార్టీయే అని చెప్పడానికి నేను ఏమాత్రం సందేహించడం లేదు.

* మన సమస్యలకు నేను పారిపోయే వ్యక్తిని కాదు, నేను మీ వైపు నిలబడే వ్యక్తిని. 

* సినిమాలకు కోట్లు తీసుకునే సత్తా వున్నా కూడా నేను ఎందుకు రాజకీయాలలోకి వచ్చానంటే , సరదాకి కాదు రాజకీయం నా బాధ్యత.

* అనకాపల్లి లిక్కర్ సిండికేట్ కి వైస్సార్సీపీ నాయకులు, టీడీపీ నాయకులు ఎలాగైతే కుమ్మక్కైపోయి డబ్బులు పంచుకున్నారో..ఒకవేళ జనసేన లేకపోతే ఈరోజున ప్రతి ఒక్కటి అలాంటి సిండికేట్ అయ్యిపోయేది.

* ఈ నేల నాది, నేను ప్రేమించే నేల.. అందుకే ఇక్కడ అన్ని సమస్యలకు నేను అండగా వున్నా..నేను ఇక్కడ వైజాగ్ లో నటన నేర్చుకున్న వాడిని. అందుమూలంగా నాకు ఉత్తరాంధ్ర  యొక్క ఆత్మ, ఆవేదన తెలుసు. 

* నేను ఇక్కడికి వస్తున్నాని తెలిసి, ఈరోజున ముఖ్యమంత్రి గారు అమరావతిలో తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ మీద సమీక్ష పెట్టారు.నేను ఉత్తరాంధ్ర వస్తే గాని ఇప్పటి వరకు వీళ్లకి మన సమస్యలు గుర్తు రాలేదా? 

* వైస్సార్సీపీ నాయకులకు నిజంగా ప్రజల పట్ల చిత్త శుద్ధి ఉంటే అసెంబ్లీకి వెళ్లి సమస్యలను లేవనెత్తాలి. తుమ్మపాల ఫ్యాక్టరీ మూసేస్తుంటే మూడున్నర సంవత్సరాలు టీడీపీ వాళ్ళని అడగకుండా మీరెందుకు చూసారు? మీరు అడగాలి..తెలుగుదేశం ప్రభుత్వాన్ని నిలదీయాలి?

* తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ నిర్మించమంటే సీఎం అయిన తర్వాత జగన్ గారు నిర్మిస్తామంటే, ఈలోపుల ఇక్కడ ప్రజలు చచ్చిపోవాలా? 17 నిండు ప్రాణాలు దారిద్రంతో బలయ్యిపోయాయి.  

* ఆ 17 మంది చావుకి తెలుగుదేశం ప్రభుత్వం కారణమయ్యింది. దీనికి వైస్సార్సీపీ కూడా బాధ్యత వహించాలి, ఎందుకంటే వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడలేదు.  ప్రజా సమస్యల మీద పోరాటం చెయ్యడానికి టీడీపీకి, వైస్సార్సీపీకి చిత్తశుద్ధి లేదు. ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ లేకుండా జనసేన ప్రజల తరపున పోరాటం చేస్తుంది.

* ఒక్కొక్క ఎంపీ ఎంత బద్దకంతో వున్నారో చూడండి. ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జి మీద ఒక లెటర్ కూడా రాయలేకపోయారు. అవంతి శ్రీనివాసు గారు నిజంగా తలచుకుంటే చాలా చేసేవారు, దోపిడీని అరికట్టే వారు, కానీ అలా చెయ్యలేదు.

* ప్రజా సంక్షేమం కోసం ముఖ్యమంత్రి గారు తన వాళ్ళు చేస్తున్న దోపిడీని ఆపాలి. ఆ దోపీడీ లో మీకు భాగస్వామ్యం ఉందనుకుంటేనే మీరు ఆపరు, లేకపోతె ఆపుతారు. ఒకవేళ ఆపలేదంటే 2019లో ప్రజా విప్లవం ఎలా ఉంటుందో మీకు జనసేన పార్టీ చూపిస్తుంది.

* మన అనకాపల్లిని గ్రేటర్ విశాఖలో కలిపితే మన రోడ్లు బాగుపడతాయి, మన సమస్యలు తీరుతాయి అని అనుకున్నా..కానీ మన రోడ్లు, డ్రైనేజీలు అద్వానంగా ఇంకా అలానే వున్నాయి..

* క్లీన్ ఏపీ, గ్రీన్ ఏపీ ఎక్కడ ఉన్నాయో తెలియట్లేదు. అమరావతిలో ముఖ్యమంత్రి గారి ఇంటి చుట్టూ ఉన్నాయేమో!! ఇంకెక్కడా లేవు.. 

* ఎక్కడికి వెళ్లినా ఆర్బాటంగా ప్లాన్లు వేస్తున్నారు గాని, అవి నిజ రూపం దాల్చట్లేదు.  

* 2014లో నేను ఏ మాటలు అయితే చెప్పానో అవి నిలబెట్టుకోవటానికి నేను వచ్చాను, జనసేన ఆలోచనా విధానాన్ని తెలియజేయడానికి వచ్చాను. అంతే గాని ఓట్లు అడగటానికి రాలేదు.

* మరొక్కసారి మేనిఫెస్టోతో మీ ముందుకు వస్తా..తుమ్మపాలెం ఫ్యాక్టరీని ఇప్పుడు తెరిపించకపోతే జనసేన ప్రభుత్వం వచ్చి తిరిగి తెరిపిస్తుంది.

* అక్రమంగా వున్న క్వారీస్ మీద బలమైన చర్యలు తీసుకుంటాను. ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని గాని, గాలిని గాని అందించడానికి  జనసేన అండగా ఉంటుంది అని తెలియజేస్తున్నా

 

SOURCE:JANASENA

04 Jul, 2018 0 386
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved