శ్రీనివాసకళ్యాణం ఆడియో పోస్టర్
విభాగం: సినిమా వార్తలు
srinivasa-kalyanam-audio-poster_g2d

నిన్ననే దిల్ రాజు సంస్థ నుంచి `లవర్` ప్రేక్షకుల ముందుకొచ్చింది.  ఇంతలో మరో చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ ని షురూ చేశారు. తదుపరి దిల్ రాజు సంస్థ నుంచి వస్తున్న చిత్రం `శ్రీనివాసకళ్యాణం`. నితిన్ - రాశిఖన్నా హీరోహీరోయిన్లు కాగా - సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని బొమ్మరిల్లు విడుదలైన ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. నేషనల్ అవార్డుని తెచ్చిపెట్టిన `శతమానం భవతి` తర్వాత దిల్ రాజు - సతీష్ వేగేశ్న కలిసి తీస్తున్న సినిమా ఇది. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే  దిల్ రాజు సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు. మొదట్నుంచీ కూడా ఈ సినిమాపైన ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ కనిపిస్తున్నారు. రేపట్నుంచే ఆడియో మార్కెట్లోకి విడుదలవుతోంది.

ఆ విషయాన్ని తెలియజేస్తూ శనివారం ఓ పోస్టర్ ని విడుదల చేశారు. అందులో నితిన్ - రాశిఖన్నా సూపర్బ్ అనిపించేలా ఉన్నారు. కథానాయిక కాలిని తనపై పెట్టుకొని ఆభరణం తొడుగుతున్నాడు నితిన్. ఈ పిక్ సినిమా ఎంత కూల్ గా - ఎంత రొమాంటిక్ గా ఉండబోతోందో తెలియజేస్తుంది. పెళ్లి చుట్టూ సాగే కథతో ఈ చిత్రం రూపొందుతున్నట్టు సమాచారం

 

SOURCE:TUPAKI.COM

21 Jul, 2018 0 374
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved