కథ మార్చమని దర్శకుడి పై ఒత్తిడి
విభాగం: సినిమా వార్తలు
stress-on-the-director-to-change-the-story_g2d

వరుసగా ఆరు ఫ్లాపులు రావడం మాట అటుంచితే పాతిక కోట్ల మార్కెట్‌ వున్న హీరోకి కనీసం అయిదు కోట్ల షేర్‌ కూడా రాకపోవడం మాత్రం షాకింగే. వరుసగా ఇంటిలిజెంట్‌, తేజ్‌ చిత్రాలకి నాలుగు కోట్ల లోపే షేర్‌ రావడంతో సాయి ధరమ్‌ తేజ్‌ కుదేలయ్యాడు. అర్జంటుగా ఫిజిక్‌ కరక్షన్‌ కోసం యుఎస్‌ వెళ్లిపోయిన తేజ్‌ మరో మూడు నెలల వరకు తిరిగి రాడట. ఆల్రెడీ ఓకే చేసిన 'చిత్రలహరి' చిత్రాన్ని ఆగస్టులో మొదలు పెట్టాల్సిన వాడే నవంబర్‌కి నెట్టాడు. వరుసగా తగిలిన దెబ్బలతో ఈ చిత్రం కథని కూడా మార్చమని దర్శకుడిపై ఒత్తిడి తెస్తున్నాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

నానితో కథాపరంగా ఇబ్బందులు తలెత్తడం వల్లే దర్శకుడు కిషోర్‌ తిరుమల వచ్చి తేజ్‌కి కథ చెప్పాడు. మొదట ఒక్క మార్పు కూడా లేకుండా కథ ఓకే చేసేసిన తేజ్‌కి తన వరుస వైఫల్యాలతో భయం పట్టుకుందట. అందుకే ఈ చిత్ర కథకి రిపేర్లు చేయమని చెబుతున్నాడని, అయితే కథ ఏ విధంగా మార్చాలనేది చెప్పకుండా ఇంకా మార్చమంటూ దర్శకుడిని కన్‌ఫ్యూజ్‌ చేస్తున్నాడని గాసిప్స్‌ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం హీరో గురవుతోన్న ఒత్తిడి సంగతి తెలుస్తున్నా కానీ పూర్తి కాన్ఫిడెన్స్‌ లేని అతడిని ఎలా డీల్‌ చేయాలనేది తెలియక దర్శకుడు, నిర్మాతలు తల పట్టుకున్నారని భోగట్టా. ఇదిలావుంటే అతను ఇంతకుముందు ఓకే చేసిన పలు చిత్రాలని కూడా తేజ్‌ కాన్సిల్‌ చేసుకున్నాడని, ఒక హిట్‌ ఇచ్చాక కానీ కొత్త ప్రాజెక్టులు లైన్‌లో పెట్టరాదని అనుకుంటున్నాడని గుసగుసలాడుకుంటున్నారు

 

SOURCE:GULTE.COM

25 Jul, 2018 0 353
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved