చిరంజీవితో సైరా అంటున్న సుదీప్
విభాగం: సినిమా వార్తలు
sudeep-excited-work-with-chiranjeevi-for-sye-raa-movie_g2d

బ్రిటీష్ వారిని ముప్పుతిప్పలు పెట్టిన తెలుగు స్వాంతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతోన్న చిత్రం ‘సైరా-నరసింహారెడ్డి’. మెగా స్టార్ చిరంజీవి లీడ్ రోల్ లో రాంచరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ తమిళనటుడు విజయ్ సేతుపతి - సుదీప్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.. నయనతార - తమన్నా హీరోయిన్లుగా యాక్ట్ చేస్తున్నారు. 

సైరాలో అవకాశం దక్కడంపై కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ స్పందించారు. ‘సైరా నా ఫస్ట్ హిస్టారికల్ సినిమా. చాలా ఎగ్జైటెడ్ గా ఉంది. అదే సమయంలో కొంచెం వర్రీగా ఉన్నాను’ అన్నారు. ‘‘సినిమా నా మీద ఎప్పుడూ ప్రేమనే చూపిస్తుంది. రెగ్యులర్ గా నా జర్నీలోకి సర్ ప్రైజ్ లు  వస్తున్నాయి. వాటిలో ‘సైరా’లో లెజెండ్ చిరంజీవి గారితో నటించడం ఒకటి’’ అంటూ సుదీప్ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు

 

SOURCE:TUPAKI.COM

10 Jul, 2018 0 429
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved