సెక్స్ రాకెట్‌లో హీరోయిన్ల పేర్లు బయట పెట్టిన త‌మిళ న‌టి
విభాగం: సినిమా వార్తలు
tamil-actress-outside-names-of-heroines-in-sex-racket_g2d

త‌మిళ సినీలోకంలో సంచ‌ల‌నం చోటు చేసుకుంది. భారీ సెక్స్ రాకెట్ బ‌య‌ట‌ప‌డింది. ఇందులో ఎవ‌రూ రెడ్ హ్యాండెడ్‌గా దొర‌క‌లేదు గాని... మొత్తం ఎవ‌రెవ‌రు ఆ బిజినెస్‌లో ఉన్నారో మాత్రం పోలీసుల వ‌ద్ద‌కు చేరింది. జాబితా అంతా పోలీసుల చేతికి చేరినా.. దానిని వారు బ‌య‌ట‌పెట్ట‌లేదు. అయితే, ఇందులో ఉన్న కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను పేర్లు చెప్ప‌కుండా పోలీసులు బ‌య‌ట‌పెట్టారు. వ్య‌భిచార నిర్వ‌హ‌కుల లిస్టులో ఉన్న హీరోయిన్ల జాబితా చూసి పోలీసుల‌కే దిమ్మ‌తిరిగింది. ఈ బిజినెస్‌ను ఎంతో ఆర్గ‌నైజ్డ్‌గా చేస్తున్న విధానంతో పోలీసులు అవాక్క‌య్యారు. 

వాట్సప్ వేదిక‌గా ఈ వ్య‌భిచారం జ‌రుగుతోంది. త‌మిళ సినిమాలో చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి హీరోయిన్ల వ‌ర‌కు ఈ జాబితాలో ఉన్నారు. త‌మిళనాడులోని విరుగంబాక్కానికి చెందిన మురుగ పెరుమాన్, కవియరసన్ లు దీనిని నిర్వ‌హిస్తున్నారు. వాట్సాపే వీరి ఆఫీసు. వీరు సంబంధాలు పెట్టుకున్న న‌టీమ‌ణుల ఫొటోలు, ఒక్క రాత్రికి వారి రేట్ల వివ‌రాల‌తో ఏకంగా ఒక ఆల్బ‌మ్‌నే త‌యారుచేశారు. ప‌లువురు వ్యాపార‌వేత్త‌ల‌కు, సినిమా వాళ్ల‌కు, రాజ‌కీయ నాయ‌కుల‌కు ఇత‌ర ప్ర‌ముఖుల‌కు వీరు మ‌హిళా న‌టుల‌ను వినోదం కోసం పంపిస్తుంటారు. 

ఇది ఎలా బ‌య‌ట‌కు వ‌చ్చిందంటే...

త‌మిళ న‌టి జ‌య‌ల‌క్ష్మికి మంచి ఈ బిజినెస్ ఆఫ‌ర్లు ఇస్తూ ఇటీవ‌ల వ‌రుస‌గా మెసేజ్‌లు వ‌చ్చాయ‌ట‌. మొద‌ట్లో వాటిని ప‌ట్టించుకోని జ‌య‌ల‌క్ష్మి వ‌రుస‌గా వ‌చ్చేట‌ప్ప‌టికి పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చింది. రిలేషన్ షిప్ డేటింగ్ సర్వీస్ పేరుతో రెండు నంబర్ల నుంచి జ‌య‌ల‌క్ష్మి వాట్సాప్ కు మెసేజ్లు వ‌స్తున్నాయి. డేటింగ్ అనే ఒక అంద‌మైన పేరు పెట్టి...ఇది డేటింగ్‌ ప్రత్యేకమని, డేటింగ్ చేసేందుకు వీఐపీలు కూడా సిద్ధంగా ఉన్నారని, రూ.30 వేల నుంచి రూ.3 లక్షలు వరకు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారని, ఆస‌క్తి ఉంటే జాయిన్ అవ‌మ‌ని జ‌య‌ల‌క్ష్మిని రిక్వెస్ట్ చేశార‌ట‌. 

ఆ నెంబ‌ర్ల ఆధారంగా పోలీసులు ద‌ర్యాప్తు జ‌ర‌ప‌గా... విరుగంబాక్కానికి చెందిన మురుగ పెరుమాన్, కవియరసన్ లు దీనిని నిర్వ‌హిస్తున్న‌ట్టు తెలిసింది. వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లలోని ఫొటోలు, వివరాలు పోలీసులను ఆశ్చ‌ర్యానికి గురిచేశాయి. అందులో బోలెడు కోలీవుడ్ మహిళా నటుల ఫొటోలు, వారి రేట్ల‌తో ఏకంగా డిజిట‌ల్ ఆల్బ‌మ్ తయారుచేశారు.

అందులో ఒక ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏంటంటే... ఒక ప్ర‌ముఖ యువ‌న‌టి ఒక్క రాత్రికి ఈ ప‌నికి ఒప్పుకుందుకు రూ.40 లక్షలు చార్జి చేస్తుంద‌ట‌. ఇలా 70 మంది యువ మ‌హిళా న‌టుల‌ ఫొటో-రేట్ల మాన్యువ‌ల్‌ ఆల్బ‌మ్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, త‌మిళంలో య‌వ నటీమ‌ణులు అంద‌రూ తెలుగులో కూడా న‌టించారు. మ‌రి ఆ 40 ల‌క్ష‌లు తీసుకుంటున్నా హాట్ గాల్ ఎవ‌రై ఉంటారో

 

SOURCE:GULTE.COM

14 Jul, 2018 0 996
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ 2022 galli2delhi.com All Rights Reserved
@ 2022 galli2delhi.com All Rights Reserved