మెగా అల్లుడు ఇంతటితోనే తృప్తి పొందుతాడా
విభాగం: సినిమా వార్తలు
the-mega-wrestling-is-so-satisfied-with_g2d

ఈ రోజుల్లో జనాల్ని థియేటర్లకు రప్పించడం చాలా కష్టమైన వ్యవహారం అయిపోతోంది. అమేజాన్ లాంటి డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్‌లోకి కొత్త సినిమాలు నెలా రెండు నెలలకే వచ్చేస్తుండటం.. పైరసీ.. ఇతర కారణాల వల్ల క్రమంగా జనాలు థియేటర్ల వైపు చూడట్లేదు. పెద్ద హీరోల సినిమాలకు ఉండే హైప్ వేరు కాబట్టి ఓకే కానీ.. చిన్న స్థాయి హీరోల సినిమాలకు జనాల్ని థియేటర్లకు రప్పించాలంటే చాలా కష్టపడాలి. 

ప్రమోషన్లు గట్టిగా చేయాలి. ఆసక్తికర టీజర్.. ట్రైలర్లతో ఆకర్షించాలి. ప్రమోషన్లనేవి ఈ రోజుల్లో చాలా కీలకంగా మారిపోయాయి. అందులోనూ ఒక కొత్త హీరో సినిమా అంటే ప్రమోషన్ల హడావుడి మరింత ఎక్కువ ఉండాలి. ఐతే మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న ‘విజేత’ సినిమాకు ఈ హడావుడి పెద్దగా కనిపించడం లేదు.

కొన్ని రోజుల కిందట చిరు ముఖ్య అతిథిగా ప్రి రిలీజ్ ఈవెంట్ ఒకటి చేశారు. ఆ సందర్భంగా సినిమా బాగానే వార్తల్లో నిలిచింది. అంతకుముందు కూడా కోడి పాట అదీ రిలీజ్ చేసి కొంచెం హడావుడి చేశారు. కానీ ప్రి రిలీజ్ ఈవెంట్ తర్వాత మాత్రం అసలు ఏ సందడి లేదు. ప్రమోషన్లు పూర్తిగా పక్కన పెట్టేశారు. జులై 12న రిలీజ్ డేట్ ప్రకటించేశారు కానీ.. కనీసం సోషల్ మీడియాలో కూడా ఏ అప్ డేట్ లేదు. ఏ ప్రమోషన్ లేదు. రిలీజ్ వారంలో చూసుకుందాం అనుకున్నారేమో కానీ.. ఈ వారాంతంలో రెండు సినిమాలు రిలీజవుతున్న నేపథ్యంలో వాటి గురించి మూణ్నాలుగు రోజులు చర్చలుంటాయి. 

ఆ తర్వాత మిగిలిన రెండు మూడు రోజుల్లో ఏం ప్రమోషన్ చేస్తారు. జనాల్ని థియేటర్లకు ఎలా రప్పిస్తారు? చిరు మేనల్లుడైతే ఓకే కానీ.. బయటి ఫ్యామిలీ నుంచి వచ్చిన కొత్త వ్యక్తి కాబట్టి కళ్యాణ్‌ను మెగా అభిమానులు ఏమాత్రం ఓన్ చేసుకుంటారన్నది సందేహమే. ఏ హీరోకైనా తొలి సినిమా అనేది చాలా కీలకం. చిరు అల్లుడు కాబట్టి హడావుడి గట్టిగా ఉంటుందని.. ప్రమోషన్లతో హోరెత్తించేస్తారని అనుకుంటే అలాంటిదేమీ లేకుండా సైలెంటుగా ఉన్నారు. మరి చిత్ర బృందం ఆలోచనేంటో

 

SOURCE:GULTE.COM

04 Jul, 2018 0 340
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved