బాలయ్య రెండో మనమడి నామకరణం
విభాగం: సినిమా వార్తలు
the-second-name-of-balayya-is-named-after-him_g2d

దేవాన్ష్.. తెలుగు వారందరికి సుపరిచితమైన పేరు. ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ముద్దుల మనమడిగా.. బాలయ్యకు తాత హోదాను ఇచ్చినోడిగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాడు. ఎప్పుడూ కుటుంబం గురించి.. కుటుంబ సభ్యుల గురించి పెద్దగా మాట్లాడని చంద్రబాబు నోటి నుంచి పదేపదే మనమడి ప్రస్తావన వచ్చేది. చివరకు విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు తానెంత బిజీగా ఉన్న విషయాన్ని చెప్పే క్రమంలో దేవాన్ష్కు చాకెట్లు కూడా కొనలేకపోయానన్న బాధను వ్యక్తం చేసేవారు.

బాబు విషయాన్ని వదిలేస్తే.. బాలయ్యకు సైతం దేవాన్ష్ అంటే ఎంతో ఇష్టం. తాజాగా ఆయన మరోసారి తాత అయ్యారు. బాలయ్య రెండో కుమార్తె తేజస్విని ఇటీవల బాబుకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. మార్చి 22 తెల్లవారుజామున తేజస్విని.. శ్రీభరత్ లకు మగబిడ్డ పుట్టాడు. ఈ బుజ్జిబాబుకు తాజాగా పేరు పెట్టారు.

తన కో బ్రదర్ కొడుక్కి ఆర్యవీర్ అన్న పేరును పెట్టినట్లుగా ఏపీ మంత్రి కమ్ సీఎం బాబు కుమారుడు లోకేశ్ తాజాగా వెల్లడించారు. సోషల్ మీడియా అప్పుడప్పుడు పోస్టులు పెట్టే లోకేశ్.. తాజాగా ఈ విషయాన్ని తెలియజేశారు. భరత్.. తేజస్వినిలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. మిమ్మిల్ని తల్లిదండ్రులుగా పొందటం ఆర్యవీర్ అదృష్టం. ఇవి మీకు మధుర క్షణాలు అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు. తెలుగోళ్ల ఆత్మగౌరవం మీద గళం విప్పిన ఎన్టీవోడి మునిమనమడి పేరులో తెలుగు వాసన మిస్ అయినట్లుగా లేదు

 

SOURCE:TUPAKI.COM

09 Jul, 2018 0 669
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved