నిర్మాతగా మారిన సీనియర్ హీరోయిన్
విభాగం: సినిమా వార్తలు
the-senior-heroine-turned-producer_g2d

మెగాస్టార్ చిరంజీవి సరసన అత్యధిక సినిమాల్లో నటించిన కథానాయికల్లో రాధికా శరత్ కుమార్ ఒకరు. సినిమాల్లో కథనాయికగా అవకాశాలు తగ్గాక… క్యారెక్టర్ రోల్స్, సీరియల్స్ వైపు వచ్చారు. నిర్మాతగా మారారు. ఆమె సిస్టర్ నిరోషా కూడా కథానాయికే. అక్క బాటలో నడుస్తూ సినిమాల్లోకి వచ్చారు. తెలుగులో చిరంజీవి ‘స్టువర్టుపురం పోలీస్ స్టేషన్’ తదితర సినిమాల్లో నటించారు. అయితే ఆమెకు బాగా పేరు తీసుకొచ్చిన సినిమా ‘సింధూరపువ్వు’ అని చెప్పాలి. అందులో హీరో రాంకీతో ఎక్కువ సినిమాలు చేసిన ఆమె తర్వాత ఆయన్ను పెళ్లాడింది. త్వరలో వీరిద్దరూ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయనున్నారు. ఈ విషయాన్ని రాంకీ చెప్పారు. ఈ నెల12న విడుదల అవుతున్న ‘ఆర్ ఎక్స్ 100’లో ఆయన కీలక పాత్ర చేశారు. సినిమా నచ్చడంతో తమిళ్ డబ్బింగ్ రైట్స్ తీసుకున్నానని చెప్పారు. అక్క బాటలో నడుస్తూ నిర్మాణంలోకి వస్తున్న నిరోషా ఎలాంటి సినిమాలు తీస్తారో

 

SOURCE:TELUGU360.COM

10 Jul, 2018 0 352
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved