భీమవరం నేలలో చాలా శక్తి ఉంది - శ్రీ పవన్ కళ్యాణ్ గారు
విభాగం: రాజకీయ వార్తలు
theres-lot-of-power-in-bhimavaram-says-pawan_g2d


పోరాటయాత్రలో భాగంగా జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ సంఘాలతో జరిగిన సమావేశంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం :

 

* భారతదేశం అనేక కులాల సమూహం. మన సంస్కృతిని చాలా బలంగా కాపాడగలుగుతుంది బ్రాహ్మణ సమాజం.

* గతంలో పూర్వీకులు సృష్టించిన పరిస్థితులకు ఇప్పటి తరం బ్రాహ్మణులకు శిక్ష పడకూడదని నేను కోరుకుంటా. బ్రాహ్మణ సమాజంలో గొప్ప మహానుభావులు పుట్టారు.

* జ్ఞానానికి తగ్గ పారితోషకం ఉండాలి. మీరు చెప్పిన ఇన్సూరెన్సు ల వంటి వాటిని నేను కచ్చితంగా ముందుకు తీసుకువెళ్తాను.

* నేను ఒక కులాన్ని నమ్ముకుని రాజకీయాలలోకి రాలేదు. నాకు అధికారం అనేది అంతిమ లక్ష్యం కాదు.

* నేను చాలా బాధ్యత తో కూడి రాజకీయాల్లోకి వచ్చా. ఇంత బలం ఉండి నేను కూడా రాజకీయాల్లోకి రావడానికి ధైర్యం చెయ్యకపోతే దేశ భవిష్యత్తు గురించి ఆలోచించే వారు వుండరు.

* రకరకాల గొడవలు సృష్టించి, ఎవరో చేసిన తప్పుకి ఇప్పటి తరాన్ని బాధ పెట్టడం మంచిది కాదు.

* అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నా, దానికి జనసేన పార్టీ ఎప్పుడూ కృషి చేస్తుంది.

* కార్పొరేషన్ లు వున్నా గాని సమగ్రంగా జరగట్లేదు. చాలా లోటుపాట్లు వున్నాయి. ప్రభుత్వానికి, నాయకులకు స్వార్ధం లేకపోతే ఆ లోటుపాట్లు వుండవు.

* ఎంత సాదించగలనో నాకు తెలియదు, ఎంతో తపనతో మంచి చేద్దామని రాజకీయాలలోకి వచ్చా, అదే నన్ను ముందుకు తీసుకువెళ్తుంది.

* ఇప్పుడు ఉన్న వ్యవస్థలో ఒక విలువలతో కూడిన రాజకీయం చెయ్యాలన్నా, రాజకీయ పార్టీ పెట్టాలన్నా చాలా కష్టమైన పని. 

* ఎన్నో చర్చీలు, దేవాలయాలు వున్న ప్రాంతం భీమవరం. ఎందరో మహానుభావులు పుట్టిన ప్రాంతం. భీమవరం నేలలో చాలా శక్తి వుంది. 

* ఈ భీమవరం నేలకున్న గొప్పతనం నాకు శక్తినిస్తుంది మరియు నన్ను సంస్కరిస్తుంది. 

* మీ స్ఫూర్తిని, ఆశీస్సులను రాష్ట్రమంతటా తీసుకు వెళ్తాను. మీ సమస్యలు మాకు చెప్పండి. 

* ప్రభుత్వ ఖజానాలో చాలా డబ్బు వుంది. దానిని ఎవరూ వాడరు. ఆ డబ్బుని సద్వినియోగం చెయ్యాల్సిన అవసరం వుంది. అందరికి సద్వినియోగం చేసేలా నేను చెయ్యగలను.

* నేను బలమైన పోరాటం చెయ్యగలను. అధికారమనేది దానికంతట అదే రావాలి తప్ప, నేను దాని కోసం పాకులాడను.

 

 

SOURCE:JANASENA.ORG

09 Aug, 2018 0 622
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ 2022 galli2delhi.com All Rights Reserved
@ 2022 galli2delhi.com All Rights Reserved