ప్రభాస్ పొలిటికల్ ఎంట్రీకి సమయం ఉంది
విభాగం: రాజకీయ వార్తలు
time-for-prabhas's-political-entry_g2d

వచ్చే ఏడాదిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో… తదుపరి ఆరు మాసాలలో ఏపీలో రాజకీయం రసకందాయంగా నడవనుంది. ముఖ్యంగా స్టార్ హీరో పవన్ కళ్యాణ్ బరిలో ఉండడంతో, ఆయనకు సహకారంగా, ప్రత్యర్ధిగా ఇతర హీరోలను బరిలోకి దించేందుకు అన్ని పార్టీలు తమ తమ బ్యాక్ గ్రౌండ్ లను సిద్ధం చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే చిరంజీవి ఉండగా, టిడిపికి బాలయ్య ఎలాగూ ఉన్నారు. ఇక ఏపీలో పాగా వేయాలని భావిస్తున్న బిజెపి తరపున ‘బాహుబలి’ ప్రభాస్ ను రంగంలోకి దించాలని యోచిస్తోన్న వార్తల గురించి తెలియనిది కాదు. నిజానికి ప్రభాస్ ను దేశవ్యాప్తంగా బిజెపి తరపున ప్రచారం చేయించాలని సన్నాహాలు చేస్తున్నారంటూ గతంలో వార్తలు వెలువడ్డాయి. దీనిపై తాజాగా రెబల్ స్టార్ కృష్ణంరాజు వివరణ ఇస్తూ… ప్రభాస్ కు, ఆయన అభిమానులకు మాంచి ఊరటనిచ్చే విషయాన్ని తెలిపారు. “ప్రభాస్ పొలిటికల్ ఎంట్రీకి సమయం ఉందని, చిత్ర పరిశ్రమలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడని, వచ్చే ఎన్నికలలో ప్రభాస్ ను బిజెపి తరపున ప్రచారం చేయించే ఉద్దేశం తమకు లేదని” స్పష్టం చేయడం అనేది… నిజంగా ప్రభాస్ నెత్తిన పాలు పోసినట్లే చెప్పవచ్చు. నిజానికి ఇలాంటి పరిస్థితులలో బిజెపి తరపున బరిలోకి దిగితే, ‘బాహుబలి’ ద్వారా ప్రభాస్ కు వచ్చిన క్రేజ్ నంతా దుర్వినియోగం చేసుకున్నట్లే అవుతుంది

 

SOURCE:MIRCHI9.COM

03 Jul, 2018 0 366
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved