బీజేపీ లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న టాలీవుడ్ హీరోయిన్
విభాగం: రాజకీయ వార్తలు
tollywood-heroine-with-key-responsibilities-in-the-bjp_g2d

దర్శకుడిగా మారుతీ మొదటి సినిమా “ఈ రోజుల్లో” ద్వారా తెలుగు తెరకు పరిచయమైన రేష్మా రాథోర్ ఇటీవల బిజెపిలో చేరిన విషయం తెలిసిందే. టాలీవుడ్ లో చేసినవి కొద్ది సినిమాలే అయినప్పటికీ, జూనియర్ త్రిషగా పాపులర్ అయిన రేష్మాకు పెద్ద స్థాయిలో అయితే అవకాశాలు రాలేదు. దీంతో కమలం జెండా పట్టుకున్న ఈ యువ హీరోయిన్ కు తెలంగాణా రాష్ట్ర సెక్రటరీ బాధ్యతలు అప్పగిస్తూ బిజెపి కీలక నిర్ణయం తీసుకుంది. తనకు ఇచ్చిన పాత్రను సమర్ధవంతంగా నిర్వహిస్తానని, అధిష్టానం నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని రేష్మా ఎంతో విశ్వాసంగా చెప్తోంది. తెలంగాణా రాష్ట్ర సెక్రటరీ బాధ్యతలతో పాటు యువ మోర్చాలో కూడా రెష్మా కీలక బాధ్యతలు నిర్వహిస్తోంది. గతంలో యువ కాంగ్రెస్ ఎంపీగా సినీ హీరోయిన్ రమ్య రికార్డులు సృష్టించగా, ఆమెకు దక్కిన ఆదరణతో ఇటీవల రేష్మా, మాధవిలతలు బిజెపి జెండా పట్టుకున్నారు

 

SOURCE:MIRCHI9.COM

15 Jul, 2018 0 335
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved