నాయకి వలచిన నాయకుడెవరు
విభాగం: సినిమా వార్తలు
trisha-again-fall-in-love_g2d

కోలీవుడ్ బ్యూటీ త్రిష....దాదాపు 15 ఏళ్లుగా తెలుగు తమిళ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది. 35 ఏళ్ల వయసులోనూ ఫిజిక్ - గ్లామర్ ను మెయింటెన్ చేస్తోన్న ఈ హాట్ బ్యూటీ .....ఇపుడు కూడా చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. ఒక హీరోయిన్ గా 15 ఏళ్ల పాటు కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా రన్ చేయడమే కాకుండా....ఈ వయసులో కూడా కుర్ర హీరోయిన్లకు పోటీపడి నటించడం విశేషం. ప్రస్తుతం విదేశాల్లో వెకేషన్ ను ఎంజాయ్ చేస్తోన్న త్రిషపై తాజాగా ఓ రూమర్ వస్తోంది. ఈ అమ్మడు మరోసారి ప్రేమలో పడిందంటూ....పుకార్లు వినిపిస్తున్నాయి. కెనడా టూర్లో ఉన్న త్రిష. ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తన ఫోటోలతో పాటు...`ఎ టేబుల్ ఫర్ టూ` అంటూ ట్వీట్ పెట్టడంతో ఆమె ప్రేమలో ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

కొద్ది రోజుల క్రితం నిర్మాత - వ్యాపారవేత్త వరుణ్ మణియన్ తో త్రిష ప్రేమ వ్యవహారం....పెళ్లి వరకూ వెళ్లింది. అయితే అనివార్య కారణాల వల్ల ఆ పెళ్లి ఆగిపోయింది. దీంతో త్రిష చాలాకాలంగా సింగిల్ గానే ఉంటోంది. అయితే తాజాగా షూటింగ్ గ్యాప్ లో కెనడా టూర్ లో ఉన్న త్రిష ...తాను ప్రేమలో పడ్డట్లు సంకేతాలిస్తోంది. తన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన త్రిష....`ఎ టేబుల్ ఫర్ టూ` అని క్యాప్షన్ పెట్టింది. దీంతో త్రిష ప్రేమలో పడిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. త్రిష ప్రేమిస్తోన్న వ్యక్తి ఎవరని....పేరేమిటి అని....ప్రశ్నిస్తున్నారు. త్వరలోనే త్రిష పెళ్లిపీటలెక్కబోతోందని మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం త్రిష చేతిలో మోహిని - గర్జన వంటి కథానాయకి పాత్రలతో కూడిన చిత్రాలతో పాటు 96 చతురంగవేట్టై - 2 1818 తదితర చిత్రాలు ఉన్నాయి

 

SOURCE:TUPAKI.COM

10 Jul, 2018 0 365
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved