వీరభోగ వసంతరాయలు ఫస్ట్ లుక్
విభాగం: సినిమా వార్తలు
veera-bhoga-vasantha-rayalu-first-look_g2d

నారా రోహిత్ సినిమా కథల్లో థ్రిల్లింగ్ మూమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఆ తరహా కథల్లో ఆయన చాలా చక్కగా ఒదిగిపోతుంటారు కూడా.  స్వతహాగా ఇంటెన్సిటీతో కనిపించే నారా రోహిత్ ఈమధ్య మళ్లీ మునుపటిలాగా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో కూడిన కథల్ని ఎంచుకొంటున్నారు. అందులో ఒకటి `వీరభోగ వసంతరాయలు`. ఒక క్రైమ్ థ్రిల్లర్ కథతో ఈచిత్రం తెరకెక్కుతున్నట్టు సమాచారం.  ఇందులో రోహిత్ తో పాటు - సుధీర్ బాబు - శ్రీవిష్ణు - శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇంద్రసేన.ఆర్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ రోజే టైటిల్ పోస్టర్ ని విడుదల చేశారు. అందులో తలకిందులుగా వేలాడిదీసి కనిపిస్తున్న స్టిల్ ప్రేక్షకుల్నినిజంగానే థ్రిల్ చేస్తోంది. కేవలం పోస్టర్ లోనే ఈ స్థాయి థ్రిల్ ఉందంటే ఇక సినిమాలో ఎంతుంటుందో చూడాలి.  శ్రీనివాసరెడ్డి కూడా ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల కాలంలో నారా రోహిత్ సినిమాలు అంత ఎఫెక్టివ్ గా ప్రేక్షకులపై ప్రభావం చూపించిన దాఖలాలు లేవు. ఈ చిత్రంతో మాత్రం మునుపటి రోజుల్ని గుర్తు చేయాలనే ఆలోచనలో ఉన్నారు రోహిత్. కల్ట్ ఈజ్ రైజింగ్ అనే క్యాప్షన్ తో వస్తున్న ఈసినిమాతో రోహిత్ కెరీర్ ఏ రేంజ్లో రైజ్ అవుతుందో చూడాలి మరీ

 

SOURCE:TUPAKI.COM

11 Jul, 2018 0 288
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved