ఎన్టీఆర్ ఫ్యామిలీ తో విద్యాబాలన్
విభాగం: సినిమా వార్తలు
vidya-balan-with-ntr-family_g2d

ఎన్టీఆర్ బయోపిక్ లో కీలకమైన బసవరామతారకం పాత్రను బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. విద్యాబాలన్ చాలా ప్రతిభగల నటి. బసవరామతారకం పాత్ర బయోపిక్ కే కీలకం.

అందుకే విద్యాబాలన్ ఈ రోజు అంతా ఆ పాత్ర గురించి తెలుసుకోవడానికే కేటాయించింది. నేరుగా ఆమె ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరినీ కలిసినట్లు యూనిట్ వర్గాల బోగట్టా.

ముఖ్యంగా ఎన్టీఆర్ కుమార్తెలు, కోడళ్లను కలిసి, బసవరామ తారకం గురించి వారికి తెలిసిన సంగతులు అడిగి తెలుసుకుందట. ఎలా వుండేవారు. మ్యానరిజమ్స్ ఏమైనా వున్నాయా? ఎలా నడిచేవారు? ఎలా కూర్చునేవారు? అభిరుచులు ఇలా ప్రతీదీ అడిగి తెలుసుకుందట.

ఈ ఇన్ పుట్స్ అన్నీ తనకు పాత్ర పోషణకు పనికి వస్తాయని ఆమె వారితో అన్నారట. బసవరామతారకం గురించి సాధారణ ప్రజానీకానికి పెద్దగా తెలియదు. కానీ అందువల్ల దర్శకుడి ఇన్ పుట్స్ సరిపోతాయి. కానీ విద్యాబాలన్ అలా వదిలేసే నటి కాదు. పూర్తి ఇన్ వాల్వ్ మెంట్ తో చేసే నటి. అందుకే ఈ ఎక్స్ ర్ సైజ్ అంతా.

ఎన్టీఆర్ ఫ్యామిలీ మహిళలంతా తల్లి గురించి, అత్తగారికి గురించి, ఆమె సంగీత అభిరుచి గురించి కూడా వివరంగా చెప్పి విద్యాబాలన్ కు సహకరించారట

 

SOURCE:GREATANDHRA.COM

17 Jul, 2018 0 339
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved