డిజాస్టర్ సినిమాకు విజయోత్సవమా
విభాగం: సినిమా వార్తలు
vijayotsavam-for-disaster-movie_g2d

మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుంచి కొత్తగా అరంగేట్రం చేసిన కళ్యాణ్‌ దేవ్‌కు బాక్సాఫీస్ దగ్గర చేదు అనుభవమే ఎదురైంది. హీరోగా అతడి తొలి సినిమా ‘విజేత’ పేలవమైన టాక్ తెచ్చుకుంది. ఆ చిత్రానికి కనీస ఓపెనింగ్స్ కరవయ్యాయి. ‘బాహుబలి’ లాంటి మెగా సినిమాకు పని చేసిన టాప్ కెమెరామన్ సెంథిల్ కుమార్‌తో సహా మంచి టెక్నీషియన్లను పెట్టుకుని మంచి ప్రొడక్షన్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మించాడు సాయి కొర్రపాటి. దాదాపు రూ.7 కోట్ల పెట్టుబడి పెడితే.. అందులో ఇప్పటిదాకా పదో వంతు కూడా వసూలవ్వలేదు. మూడు రోజుల్లో కేవలం 50 లక్షల షేర్ మాత్రమే వసూలైంది. ఫుల్ రన్లో కోటి రూపాయల షేర్ రావడం కూడా కష్టంగా ఉంది. వచ్చే ఆదాయం పబ్లిసిటీ ఖర్చులకే సరిపోయేలా ఉంది. దీన్ని కేవలం డిజాస్టర్ అంటే సరిపోదు.

పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లు గట్టిగా చేస్తున్నప్పటికీ ఫలితం దక్కేలా కనిపించడం లేదు. ఇలాంటి సినిమాకు విజయోత్సవం అంటూ ఆదివారం ఈవెంట్ చేస్తున్నారు. రిలీజ్ ముంగిట పెద్దగా ప్రమోషన్లేమీ చేయని చిత్ర బృందం.. రిలీజ్ తర్వాత మాత్రం మెగా అల్లుడి సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. ఇప్పటికే చిరంజీవితో ఒక ప్రెస్ మీట్ పెట్టించారు. రామ్ చరణ్ కళ్యాణ్‌ దేవ్‌ను అభినందిస్తున్న ఫొటోలు విడుదల చేశారు. ఈ రోజు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విజయోత్సవం చేస్తున్నారు. కానీ సినిమాకు ఇవేమైనా ఉపయోగపడతాయా అన్నది సందేహమే. అయినా సినిమాకు ఎలాంటి వసూళ్లు వస్తున్నాయో.. దీని రిజల్ట్ ఏంటో  అర్థమైపోయాక ‘విజయోత్సవం’ అంటూ ఈవెంట్ చేస్తే జనాలకు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా? ఆల్రెడీ దీని మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది. ఇక ఈ ఈవెంట్ సందర్భంగా జనాలేమంటారో చూడాలి. మొత్తానికి మెగా అల్లుడి తొలి సినిమాకు ఇలాంటి దుస్థితి ఎదురవుతుందని ఎవ్వరూ ఊహించి ఉండరేమో

 

SOURCE:GULTE.COM

15 Jul, 2018 0 362
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved