విశాల్ నుంచి నాకు హాని ఉంది అంటున్న శ్రీరెడ్డి
విభాగం: సినిమా వార్తలు
vishal-is-harmful-to-me-srila-reddy_g2d

టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పై సంచలన ఆరోపణలతో పెను దుమారం రేపిన నటి శ్రీరెడ్డి కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా - కోలీవుడ్ పై ఫోకస్ చేసిన శ్రీరెడ్డి....మురుగదాస్ - లారెన్స్ - హీరో శ్రీరామ్ లపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. 5 సంవత్సరాల క్రితం జరిగిన సీసీఎల్ సందర్భంగా....`రోజాపూలు` ఫేమ్ శ్రీరామ్(తమిళంలో శ్రీకాంత్) తనతో ఒక నైట్ స్పెండ్ చేశాడని..... సినిమాల్లో అవకాశం ఇస్తానని మోసం చేశాడని షాకింగ్ కామెంట్స్ చేసింది. మరోవైపు - హైదరాబాద్ లోని గోల్కొండ హోటల్లో లారెన్స్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని.....తనతో అసభ్యంగా డ్యాన్స్ చేశాడని ఆరోపించింది. తాజాగా హీరో విశాల్ పై శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు చేసింది. విశాల్ నుంచి తనకు హాని ఉందని ఆరోపిస్తూ తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ షాకింగ్ పోస్ట్ పెట్టింది. అయితే కోలీవుడ్ కు సంబంధించిన లీక్స్ ను మాత్రం ఆపబోనని శ్రీరెడ్డి చెప్పింది. 

తమిళ నిర్మాతల సంఘం అధ్యక్షుడు విశాల్ .... సినీరంగంతోపాటు రాజకీయరంగానికి చెందిన విషయాల్లో చురుగ్గా స్పందిస్తాడు. కొద్ది రోజుల క్రితంటాలీవుడ్ హీరో నానిపై శ్రీరెడ్డి షాకింగ్ ఆరోపణలు చేసిన  సమయంలో నానికి విశాల్ మద్దతుగా నిలిచాడు. నాని గురించి తనకు బాగా తెలుసని - నానిపై చేసిన నిరాధార ఆరోపణలకు సాక్ష్యాలు చూపాలని విశాల్ డిమాండ్ చేశాడు. తాజాగా కోలీవుడ్ హీరోలు - దర్శకుల పై తాను  చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో తనకు విశాల్ నుంచి హాని ఉందని శ్రీరెడ్డి ఆరోపించింది. అయినా కోలీవుడ్ కు సంబంధించిన లీక్స్ ఆపనని చెప్పింది. అయితే ఏమాత్రం సంబంధం లేని నానిపై వ్యాఖ్యలకు స్పందించిన విశాల్....తనపై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఎలా స్పందిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. కోలీవుడ్ లీక్స్ తో పాటు....మరో టాలీవుడ్ సెలబ్రిటీపై కూడా శ్రీరెడ్డి సంచలన పోస్ట్ పెట్టింది. అల్లు అర్జున్ పెద్దన్నయ్య అల్లుబాబీపై ...శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ ఖాతాలో షాకింగ్ కామెంట్స్ చేసింది. బాబీ పబ్ లవర్ అని....తామిద్దరం కలిసి మాట్లాడుకునే వారమని - డ్యాన్స్ చేసే వారమని.....ఇపుడు మిస్ అవుతున్నానని.... త్వరలోనే మళ్లీ కలుద్దామని.... శ్రీరెడ్డి పోస్ట్ పెట్టింది

 

SOURCE:TUPAKI.COM

14 Jul, 2018 0 375
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved