కష్టమైనా, నష్టమైనా ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థ కావాలి - శ్రీ పవన్ కళ్యాణ్ గారు
విభాగం: రాజకీయ వార్తలు
we-need-a-brand-new-political-organisation-says-pawan_g2d

పోరాటయాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా నిదవోలులో జరిగిన బహిరంగ సభలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం :

* ఇంత వర్షంలో కూడా తడిచిపోతూ నా కోసం వచ్చిన ఆడపడుచులకు, అన్నదమ్ములకీ పేరు పేరునా హృదయపూర్వక నమస్కారములు, వందనాలు..

* నిడదవోలులో మా నాన్న కానిస్టేబుల్ గా పనిచేసారు, నేను నిడదవోలు వచ్చింది తక్కువ సార్లు అయినా మాకు నిడదవోలుతో అనుబంధం ఎక్కువ.

* "రెడ్ రివల్యూషన్" నిడదవోలు జనసైనికులు మొదలు పెట్టారు. ఆ పేరు నాకు బాగా నచ్చింది. ప్రతీ గ్రామంలో ఎరుపు రంగు పూసిన గోడ మీద ఊరి సమస్యలు అందరికీ తెలియజేద్దాం...

* సినిమాల్లో నాకు మీరు అశేషమైన ప్రేమానురాగాలు ఇచ్చారు. గబ్బర్ సింగ్ సినిమా అనే ఒక సినిమా విజయం కోసం 12 సంవత్సరాలు వేచి చూడాల్సి వచ్చింది. అలాంటిది కొన్ని కోట్ల మంది జీవితాలను నిర్దేశించే రాజకీయాల్లో మాట్లాడాలంటే చాలా బాధ్యతగా ఉండాలి. 

* ఇన్ని సంవత్సరాలైనా నిడదవోలుకి ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కట్టలేకపోయారు, రోడ్లు వేయలేకపోయారు. 

* ఒక అనుభవం వున్న నాయకుడు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అని 2014లో పోటీ చెయ్యకుండా తెలుగుదేశానికి మద్దతు ఇచ్చా..

* ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారు, నిడదవోలుకి ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కూడా తీసుకు రాలేకపోయారు.

* నేను బయటవాడిని కాదు. నేను మీ ఇంట్లో ఒకడిని, మీలో ఒకడిని. నాకు నా కుటుంబం ఎంతో మీరు అంతే...సొంత బిడ్డలు తల్లులు వదిలేసినా జనసేన తల్లులను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుంది. 

* జన్మనిచ్చిన తల్లికి ఎంత గౌరవమిస్తానో ప్రతీ ఆడపడుచుకు, తల్లికి అంతే గౌరవం ఇస్తాను. వృద్ధాశ్రమాలు జనసేన ప్రభుత్వం నడిపిస్తుంది. తల్లులను చూసుకోవడానికి బిడ్డలకు ఇబ్బందైతే జనసేన ప్రభుత్వం వారిని చూసుకుంటుంది. 

* లక్ష కోట్లు దోచుకున్నారని టీడీపీ వైసీపీ గురించి చెప్తుంది, లక్షన్నర కోట్లు టీడీపీ దోచుకుంది అని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. నేను వున్న కోట్లు వదిలేసి వచ్చినవాడిని.

* ప్రతీ రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళ తల్లులను బాగా చూసుకుంటారు. కానీ రాజకీయ నాయకుడు సమస్త సమాజం నా కుటుంబం అనుకోవాలి.

* పవన్ కళ్యాణ్ అనే ఒక బ్రాండ్ ప్రేమతో మీరు నాకు ఇచ్చింది. అది తిరిగి మీకు ఇస్తేనే నాకు ఆనందం. నేను ఏమీ చేసినా మీకు ఇష్టమైనదే చేస్తాను. సినిమాల మాదిరిగా రాజకీయాలు కూడా చిత్తశుద్ధితో చేస్తా...

* నిడదవోలుకి ఒక్క రైల్వే ఓవర్ బ్రిడ్జ్ తేలేకపోయారంటే తెలుగుదేశం వారిది ఎంత చేతకానితనమో అర్ధమవుతుంది.

* లోకేష్ గారు మా పాలన సమర్ధవంతంగా వుంది అంటారు. మరి అదే నిజమైతే నిడదవోలుకి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఎందుకు కట్టలేకపోయారు?

* పవన్ కళ్యాణ్ ని మేము చాలా మర్యాదగా చూసుకుంటాం అని తెలుగుదేశం వారు చెప్తారు. నాకు కనిపించే మర్యాద వద్దు, గుండెల్లో మర్యాద కావాలి.

* లోకేష్ గారు మీరు ముఖ్యమంత్రి అవ్వాలంటే అవ్వండి, కానీ మీ తాత ఎన్టీ రామారావు గారు 60 సంవత్సరాలకు ముఖ్యమంత్రి అయ్యారు. మీరు కూడా అప్పుడే అవ్వండి.

* లోకేష్ గారు మీ తాత ఎన్టీ రామారావు గారు ఏ చిత్ర పరిశ్రమ నుండి అయితే వచ్చారో నేను కూడా అదే పరిశ్రమ నుండి వచ్చా..నేను మీలాగా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకోలేదు. ఒంగోలు లోని చిన్న వీధి బడిలో ఓనమాలు నేర్చుకున్నా..

* లోకేష్ గారు ముఖ్యమంత్రి అవ్వాలంటే జన జీవన క్షేత్రం లో తిరగండి, బాధలు తెలుసుకోండి, మురికివాడల్లో తిరుగుతున్న పిల్లల కష్టాలు తెలుసుకోండి, ఈగలు ముసిరిన అన్నం తినాలి అంటే అందులో వున్న బాధ తెలుసుకోండి.

* ఇప్పుడున్న యువత కొనుక్కోవడానికి వున్న యువత కాదు, విప్లవానికి తిరుగుబాటు చేసే సత్తా వున్న యువత.

* వైసీపీ నాయకులు గాని, లోకేష్ గారు గాని మా తల్లిని కుసంస్కారంతో హేళన చేసారు. మీరు మమ్మల్ని తిట్టినా మీ ఆడపడుచులని నెత్తిన పెట్టుకుని గౌరవిస్తాం..అది మా తల్లిదండ్రులు మాకు నేర్పిన సంస్కారం. 

* లోకేష్ గారు కూడా ఒక తల్లికి బిడ్డే...ఒకసారి మీ తల్లిని ఇలా వేరే తల్లిని తిట్టించా అని చెప్పండి ఆవిడ మీకు సమాధానం చెప్తారు. ముఖ్యమంత్రి అవ్వాలంటే వెన్నుపోట్లు పొడిచి అవ్వకండి.

* కెనడియన్ గారి లాంటి మహానుభావున్ని, అబ్రహం లింకన్ లాంటి మహానుభావున్ని, గాంధీ, పటేల్, సీతారామరాజు గారి లాంటి వారిని ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లోకి రావాలి తప్ప, లోకేష్ గారు మీ నాన్న గారిని ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లోకి రాకూడదు.

* లోకేష్ గారు...మీ నాన్న గారు మీ తాతని దెబ్బ తీసినట్టు మమ్మల్ని తియ్యాలనుకుంటే నేను ఎన్టీ రామారావు గారిని కాదు చూస్తూ ఊరుకోవడానికి. పిచ్చి పిచ్చి రాజకీయాలు బయట వారితో చేసుకోండి, పవన్ కళ్యాణ్ తో గాని, జనసేనతో గాని, జనసైనికులుతో గాని కాదు.

* ఎన్టీ రామారావు గారిని చివరి రోజుల్లో బాధపెట్టారు అని తెలిసినా కూడా ఒక్కొక్కసారి తప్పు చేస్తారులే  మీకు అనుభవం వుంది కదా అని మద్దతు ఇచ్చా..

* నాకు ముఖ్యమంత్రి పదవి సరదా కాదు. మీ గుండెల్లో వున్న పదవి కంటే ముఖ్యమంత్రి పదవి ఎక్కువ కాదు. రాజకీయాలు నాకు బాధ్యత.

* కష్టమైనా, నష్టమైనా ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థ కావాలి. అవినీతి, దోపిడీలతో కూరుకుపోయిన ఈ రాజకీయాలను కూలదోసి ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థను స్థాపించాల్సిన అవసరం ఈ యువతరానికి, నవతరానికి వుంది. అందుకే జనసేన పార్టీ పెట్టా..

* జగన్ గారు నా వ్యక్తిగత జీవితం గురించి తిట్టారు. మీతో పోలిస్తే నా వ్యక్తిగత జీవితం చాలా బాగుంటుంది.

* నిదవోలులో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఎందుకు లేదు అని నేను అడిగితే నువ్వు మూడు పెళ్లిళ్లు చేసుకున్నావంటారు. ఒక్క పెళ్లి చేసుకుని మీలాగా బలాదూరుగా తిరిగే వ్యక్తిని కాను నేను.

* ఇంజినీరింగ్ చదివి కూడా ఆటో నడుపుకునే వారు వున్నారు. మాములు చదువు కాకుండా నైపుణ్యం పెంచేలా జనసేన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

* ఢిల్లీ లో జరిగిన నిర్భయ ఘటన తట్టుకోలేక ఇక్కడ ఆడపడుచులు ఏడిచారు. కులానికి, మతానికి, ప్రాంతానికి సంబంధం లేకుండా వుండగలిగేది ఒక్క ఆడపడుచులు, అక్కచెల్లెళ్లు మాత్రమే..అలాంటి తల్లులు, అక్కచెల్లెళ్లు చట్టసభల్లో ఉండాలి, అప్పుడే మహిళల కష్టాలు తెలుస్తాయి. చట్టసభల్లో 33% మహిళలకు రిజర్వేషన్లకు జనసేన మద్దతు తెలుపుతుంది.  

Donate Now

* తెలుగుదేశం పార్టీ బీసీలకు అండగా వుండే పార్టీ అంటారు. తెలంగాణ లో ఎక్కువ బీసీ లు వుంటారు, అలాంటి తెలంగాణ నుండి తెలుగుదేశం వారిని ఎందుకు గెంటేశారు? వారు అక్కడ బీసీ లకు అన్యాయం చేశారు కాబట్టే.. 

* ముఖ్యమంత్రి గారు కులాల మధ్య గొడవలు పెడుతున్నారు. దాని ద్వారా ముఖ్యమంత్రి గారి కుటుంబం, జగన్ గారి కుటుంబం బాగు పడుతుందే తప్ప కులాలు కాదు. 

* వెనుకబడిన అగ్రవర్ణ కుటుంబాల వారికి కూడా రిజర్వేషన్లు కావాలి. మాకు కూడా ఒక కార్పొరేషన్ కావాలి, మాలో కూడా పేద కుటుంబాలు వున్నాయి అని క్షత్రియులు అంటున్నారు. దీనికి కారణం నీతిమాలిన పాలన వల్ల. ఆ పాలనను అరికట్టడానికే జనసేన ఆవిర్భవించింది,

* వెనుకబడిన కులాల వారికి చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పిస్తాం అని జనసేన మానిఫెస్టోలో పెట్టాం. 

* మహిళలకు వంట గ్యాస్ సిలిండర్ ఉచితంగా జనసేన ప్రభుత్వం ఇస్తుంది. మన గ్యాస్ నిక్షేపాలు బయటకు వెళ్లిపోతున్నాయి, బలంగా మన వాటాలను అడగలేకపోతున్నారు. మన గ్యాస్ నిక్షేపాల ద్వారా గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇవ్వొచ్చు.

* ఇంటి ఆడపడుచులకు రేషన్ నిమిత్తం 2500-3500 రూపాయిలు ఇస్తాం...ఇవన్నీ ఎలా సాధ్యం అంటున్నారు? మీరు లక్షల కోట్లు దోచుకున్నప్పుడు ఆడపడుచులకు గ్యాస్ ఇవ్వడం పెద్ద కష్టమేమి కాదు.

* నేను మానవత్వానికి నిలబడతాను, కులానికి కాదు.

* కాపు రిజర్వేషన్ల గురించి ముఖ్యమంత్రి గారిని సాధ్యపడుతుందా అని అడిగితే కుదురుతుందని చెప్పి ఢిల్లీ కోల్డ్ స్టోరేజీలో పెట్టేసారు.

* కాపు రిజర్వేషన్లను 9వ షెడ్యూల్ లో పెట్టి వారికి న్యాయం చేస్తాం..

* ఎక్కడికి వెళ్లినా టీడీపీ తాలూకు దోపిడీ, అవినీతి చెప్పుకుంటుంటే పొట్ట చెరువవుతుంది.   

* ఒక బలమైన, సంపూర్ణమైన ఆర్ధిక ప్రగతితో కూడిన ఆరోగ్యవంతమైన రాష్ట్రాన్ని జనసేన ఆధ్వర్యంలో సాధించుకుందాం.  

* కానూరు అగ్రహారంలో 1100 ఎకరాల భూముల పట్టాలను పట్టించుకోవట్లేదు. వచ్చే ఎన్నికలలో అసలు ఈ ఎమ్మెల్యే గెలుస్తాడా? ప్రజాస్వామ్య వ్యవస్థ ద్వారా 2019లో దింపేద్దాం..

* ముస్లింల కోసం ఏర్పాటు చేసిన సచార్ కమిటీ ద్వారా వారికి న్యాయం చేస్తాం. 

* ముస్లింలు మైనార్టీలు కాదు, సంపూర్ణ భారతీయులు. ఎవరైనా మిమ్మల్ని మైనార్టీలు అంటే మాకు జనసేన ఉందని చెప్పండి.

 

SOURCE:JANASENA.ORG

13 Aug, 2018 0 387
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved