భీమవరం పట్టణాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తాం-ప‌వ‌న్‌ క‌ళ్యాణ్
విభాగం: రాజకీయ వార్తలు
we-will-develop-bhimavaram-town-as-smart-city---pawankalyan_g2d

ప‌దేళ్లు రాజ‌కీయాలు చేయడానికి రాలేదు…  ప్రాణం పోయేంత వ‌ర‌కు ప్ర‌జ‌ల్లో ఉండాల‌ని వ‌చ్చాన‌ని జ‌న‌సేన అధ్య‌క్షులు శ్రీ ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ గారు స్ప‌ష్టం చేశారు. అంతా జ‌న‌సేన పార్టీ ఎంత కాలం ఉంటుంది అని ప్ర‌శ్నిస్తున్నారు. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఎంత కాలం పార్టీని మోస్తాడు అంటున్నారు. నవుడూరు జంక్ష‌న్ నుంచి చెబుతున్నా... న‌న్ను న‌లుగురు కాటికి మోసుకెళ్లే వ‌ర‌కు నేను జ‌న‌సేన పార్టీని మోస్తాన‌న్నారు. నా అంతిమశ్వాస వ‌ర‌కు జ‌న‌సేన‌ని మోస్తాన‌ని తెలిపారు.

 

పాల‌కొల్లు నుంచి భీమ‌వ‌రం వ‌ర‌కు నిర్వ‌హించిన ప్ర‌జా యాత్ర‌ (రోడ్ షో)లో రాయ‌కుదురు, నవుడూరు, వీర‌వాస‌రం జంక్ష‌న్ల వ‌ద్ద ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. వీర‌వాస‌రంలో శ్రీ పవన్ కల్యాణ్ గారు మాట్లాడుతూ.. “సినిమాల్లో ఉంటే కోట్లు సంపాదించ‌వ‌చ్చు, కానీ ప్ర‌జ‌ల‌కు సేవ చేసే అవ‌కాశం ద‌క్క‌దు. నిస్వార్ధంగా ప‌ని చేసేందుకే రాజ‌కీయాల్లోకి వ‌చ్చా. నిస్వార్ధంగా ప‌ని చేసే మ‌నుషులు ఇంకా ఉన్నార‌ని చెప్పేందుకే జ‌న‌సేన పార్టీ వ‌చ్చింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో టీడీపీ, వైసీపీలు మాత్ర‌మే రాజ‌కీయాలు చేయాలి అన్నట్టు ప‌రిస్థితి త‌యారైంది. కుటుంబ పాల‌న‌, వార‌స‌త్వ రాజ‌కీయాల‌కు చెక్ పెడ‌దాం. టీడీపీ. వైసీపీ రెండు ప్ర‌జ‌ల్ని మోసం చేశాయి. రెండు పార్టీలు డ‌బ్బులు పంచి ఓట్లు వేయించుకోవాల‌ని చూస్తున్నాయి. టీడీపీ వ‌ద్ద అవినీతి సొమ్ము ఉంది, వైసీపీ వ‌ద్ద వేల కోట్లు ఉన్నాయి. దోపిడి రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌, పులివెందుల నుంచి రౌడీ మూక‌ల్ని తెచ్చి అరాచ‌కాలు సృష్టించే రాజ‌కీయ వ్య‌వ‌స్థలు పోవాలి. విలువ‌ల‌తో కూడిన రాజ‌కీయాలు చేయ‌డానికి జ‌న‌సేన పార్టీ ఉంది. ఆలోచించండి. జ‌న‌సేన పార్టీ అన్ని వ‌ర్గాల‌కు అండ‌గా ఉంటుంది. ఆడ‌ప‌డుచుల‌కు పెళ్లి స‌మ‌యంలో పుట్టింటి సారె కింద ప్ర‌భుత్వం రూ. 10,116 చెల్లిస్తుంది. ఆడ‌బిడ్డ బాగుంటే స‌మాజం బాగుంటుంది. వారికి జ‌న‌సేన అండ‌గా ఉంటుంది. ప్ర‌తి కుటుంబానికి ఆదాయంతో సంబంధం లేకుండా ఏడాదికి ప‌ది గ్యాస్ సిలిండ‌ర్లు జ‌న‌సేన ప్ర‌భుత్వం ఇస్తుంది.  రేష‌న్‌కి బ‌దులు రూ.2500-3500 వ‌ర‌కు మ‌హిళ‌ల ఖాతాల‌కు జ‌మ చేస్తాం. యువ‌త‌కి ఆరు నుంచి 9 నెల‌ల ట్రైనింగ్ ఇచ్చి 25 వేల స్పెష‌ల్ పోలీస్ క‌మాండో ఉద్యోగాల్లో నియ‌మిస్తాం. అధికారంలోకి రాగానే మూడు ల‌క్ష‌ల ప్ర‌భుత్వ  ఉద్యోగాలు భ‌ర్తీ చేయిస్తాం. పేద‌ల‌కు అవ‌కాశం ఉన్న ప్ర‌తి చోటా ఇళ్ల ప‌ట్టాలు ఇస్తాం. అవ‌కాశం లేని చోట బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నాలు నిర్మించి నివాసయోగ్య‌తా ప‌త్రాలు అందిస్తాం. పేరుకి స్మార్ట్ సిటీలు అంటారు. తాగేందుకు మంచి నీరు ఉండ‌దు, డ్రైనేజీ వ్య‌వ‌స్థ అస్థ‌వ్య‌స్థంగా ఉంటుంది. అగ్నిప్ర‌మాదాలు జ‌రిగితే కాపాడుకునే ప‌రిస్థితి లేదు. భీమ‌వ‌రంని స్మార్ట్ సిటీగా అభివృద్ధిప‌రుస్తాం. డ్రైనేజీ వ్య‌వ‌స్థ‌ని ఆధునీక‌రిస్తాం. ప్ర‌జ‌ల‌కు అందుబాటులో స‌క‌ల సౌక‌ర్యాలు క‌ల్పిస్తాం. భీమ‌వ‌రం ప‌ట్ట‌ణానికి డంపింగ్ యార్డు స‌మ‌స్య ఉంది. రీ సైక్లింగ్‌కి అవ‌కాశం ఉండే ప‌ర్యావ‌ర‌ణహిత‌మైన డంపింగ్ యార్డులు పెడ‌తాం. యువ‌త‌కి బంగారు భ‌విష్య‌త్తు ఇస్తాం. ఆక్వా ప‌రిశ్ర‌మ దెబ్బ‌తిన‌కుండా, అదే స‌మ‌యంలో ప‌ర్యావ‌ర‌ణం పాడ‌వ‌కుండా నీటిని పూర్తిగా శుద్ది చేసి బ‌య‌టికి వ‌దిలే ఏర్పాటు చేస్తామ‌”ని మాట ఇచ్చారు. మా ఊరికి మంచినీరు కావాలి. అది కావాలి అంటే మీరు రావాలి అంటూ రంగు మారిన తాగునీటి బాటిల్‌ని ప్ర‌జ‌లు ప్ర‌ద‌ర్శించ‌గా, దాన్ని అందుకున్నారు. జ‌న‌సేన అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే సాధ్య‌మైనంత త్వ‌ర‌గా తాగునీటి సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తామ‌ని శ్రీ పవన్ కల్యాణ్ గారు హామీ ఇచ్చారు.

అంత‌కు ముందు నవుడూరులో మాట్లాడుతూ.. “రాజ‌కీయాలు అవినీతితో నిండిపోయాయి. చుట్టూ గోదావ‌రి ఉన్నా తాగ‌డానికి చుక్క‌నీరు దొర‌క‌ని ప‌రిస్థితి. ఈ స‌మ‌స్య‌లు అన్నీ జ‌న‌సేన పార్టీ ప‌రిష్క‌రిస్తుంది. జ‌న‌సేన అధికారంలోకి వ‌చ్చిన 8, 9 నెల‌ల్లో భీమ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం మొత్తానికి పైప్ లైన్ ద్వారా మంచినీటిని అందించే బాధ్య‌త తీసుకుంటాం. ఇళ్ల ప‌ట్టాల స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తాం. భీమ‌వరంని స్మార్ట్ సిటీగా అభివృద్ది చేద్దాం. మార్గం మ‌ధ్య‌లో వైసీపీ కార్య‌క‌ర్త‌లు ప్ర‌చారం చేస్తూ ఎద‌రొచ్చారు. వారికి అభివాదం చేశా. జ‌న‌సేన అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌కు సైతం ఇళ్ల ప‌ట్టాలు ఇస్తాం. ఇంత మంది ఆడ‌ప‌డుచులు రోడ్ల మీద‌కి వ‌చ్చారంటే రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌ను మార్చాలని మీలో ఉన్న బ‌ల‌మైన కోరికే అందుకు కార‌ణం. నేను మీకు, మీ బిడ్డ‌ల‌కు 25 ఏళ్ల బంగారు భవిష్యత్తు ఇస్తా. మా అన్నయ్య  నాగ‌బాబు నాకు రాజ‌కీయ గురువు. స్టూడెంట్ పాలిటిక్స్ నుంచి ఆయ‌న‌కు రాజ‌కీయాల మీద అవ‌గాహ‌న ఉంది. నేను ఆయ‌న్ని ఎందుకు పిలిచానంటే లా చ‌దువుకున్నాడు. సామాజిక సేవా దృక్పథం క‌లిగిన వాడు.  ప్ర‌జ‌ల‌కు ఏదో చేయాల‌న్న బ‌ల‌మైన ఆకాంక్ష క‌లిగిన వాడు. మ‌న స‌మ‌స్య‌ల పైన ఢిల్లీలో బ‌లంగా మాట్లాడేందుకు న‌ర‌సాపురం నుంచి అభ్య‌ర్ధిగా నిల‌బెట్టాం” అని తెలిపారు.

రాయ‌కుదురు వ‌ద్ద భారీ ఎత్తున త‌ర‌లివ‌చ్చిన జ‌న‌సేన శ్రేణుల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ఓ స‌రికొత్త రాజ‌కీయ వ్య‌వ‌స్థ అవ‌స‌రం ఉంద‌నీ, అంద‌రిలా అమ‌లుప‌ర‌చ‌లేని ప‌థ‌కాలు ప్ర‌క‌టించ‌ను.. నేర‌వేర్చ గ‌లిగే ప‌థ‌కాలు మాత్ర‌మే ప్ర‌క‌టిస్తాన‌న్నారు. ఒక్క ఎన్నిక‌ల కోస‌మో, ఒక్క సీజ‌న్ కోస‌మో రాలేదు. రాజ‌కీయాల్లోకి చాలా ఆలోచించి వ‌చ్చాన‌న్నారు. ఇళ్ల ప‌ట్టాల స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపుతామనీ, స్థ‌లాలు లేని వారికి బ‌హుళ అంత‌స్థుల భ‌వ‌నాలు నిర్మించి నివాస యోగ్య‌తా ప‌త్రాలు అందిస్తామని చెప్పారు. ఎమ్మెల్యే అవ‌గానే రాయ‌కుదురు చెరువు పూడికతీత స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తాని హామీ ఇచ్చారు. ప‌చ్చ‌టి గోదావ‌రి జిల్లాల‌ను చూస్తే చాలామందికి క‌న్నుకుడుతుంది.. చుట్టూ గోదావ‌రి ఉన్నా తాగేందుకు మంచినీరు లేని ప‌రిస్థితులు ఇక్క‌డ ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వ‌చ్చిన ఆరు నెల‌ల్లో అన్ని చెరువులు బాగు చేయించి తాగు నీటి సమస్యను పరిష్కరిస్తామన్ని చెప్పారు. కాలువ‌ల్లో పూడిక తీత స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించి సాగునీటి వ్య‌వ‌స్థ‌ను పున‌రుద్ద‌రిస్తామన్నారు. గోదావ‌రి ప‌రిస‌ర ప్రాంతాల‌ను ప‌రిర‌క్షించుకోవాల్సిన బాధ్య‌త మ‌న అంద‌రిపై ఉందని చెప్పారు. విద్యార్ధుల కోసం బ‌స్సులు ఆగ‌ని ప‌రిస్థితులు ఉంటే, వారి కోసం ప్ర‌త్యేకంగా బ‌స్సులు వేస్తాం అని మాటిచ్చారు.

విజ‌య‌ హార‌తులు, వీర తిల‌కాల‌తో సాగిన ప్రజాయాత్ర

జ‌న‌సేన ఎన్నిక‌ల శంఖారావంలో పాల‌కొల్లు నుంచి భీమ‌వ‌రం వ‌ర‌కు సాగిన జ‌న‌సేన అధినేత శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారి ప్ర‌జాయాత్ర‌(రోడ్ షో) ప్ర‌తి అడుగునా విజ‌య‌హార‌తులు, జ‌య‌జ‌య ధ్వానాల మ‌ధ్య సాగింది. శ్రీకాకుళం ప‌ర్య‌ట‌న ముగించుకుని హెలీకాప్ట‌ర్‌లో పాల‌కొల్లు చేరుకున్న ఆయ‌న‌కు జ‌న‌సేన శ్రేణులు, ప్ర‌జ‌లు హార‌తుల‌తో స్వాగ‌తం ప‌లికారు. అక్క‌డి నుంచి వంద‌లాది కార్లు, బైక్‌లు అనుస‌రించ‌గా శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారు త‌న వాహ‌నంలో భీమ‌వ‌రం బ‌య‌లుదేరారు. ర‌హ‌దారి పొడవునా వేలాది మంది ఆయ‌న వాహ‌న శ్రేణిని అనుస‌రిస్తూ సాగ‌నంపారు. ప్ర‌తి గ్రామంలో ఆడ‌ప‌డుచులు హార‌తులు ఇచ్చి, వీర తిల‌కాలు దిద్ద‌గా, అభిమానులు పూల వ‌ర్షం కురిపించారు. దండ‌లు తీసుకువ‌చ్చిన అభిమానుల్ని నిరాశ‌ప‌ర్చ‌కుండా త‌న వాహ‌నంపై నుంచి కిందికి వంగి మ‌రీ వాటిని స్వీక‌రించారు. పూలప‌ల్లి, లంక‌ల‌కోడేరు, వేగుల‌పాలెం, ఆర్దక‌ట్ల‌, రాయ‌కుదురు, కొణితివాడ‌, నవుడూరు, వీర‌వాస‌రంల మీదుగా భీమ‌వ‌రం చేరుకున్నారు. శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారిని అనుస‌రించిన వాహ‌నాలు సుమారు ఐదు కిలోమీట‌ర్ల మేర ర‌హ‌దారిపై నిండిపోయాయి.  ప్ర‌తి ఊరిలో ప్ర‌జ‌లు వాహ‌న‌శ్రేణిని అడ్డుకుని త‌మ స‌మ‌స్య‌లు చెప్పు కొన్నారు. వృద్దులు సైతం యువ‌కుల‌తో పోటీ ప‌డి మ‌రీ కాన్వాయ్ వ‌ద్ద‌కి వ‌చ్చి శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారికి ఆశీర్వాదాలు అందించారు. త‌న కోసం రోడ్ల ప‌క్క‌న వేచి ఉన్న ప్ర‌తి ఒక్క‌రినీ ప‌లుక‌రిస్తూ ముందుకు సాగారు. రాయ‌కుదురు, నౌడూరు, వీర‌వాస‌రం జంక్ష‌న్ల‌లో ఆశేష జ‌న‌వాహినిని ఉద్దేశించి మాట్లాడారు. నవుడూరు జంక్ష‌న్ వ‌ద్ద ప‌లువురు నాయ‌కులు పార్టీలో చేరారు. 23 కిలోమీట‌ర్ల మేర సాగిన ప్ర‌జాయాత్ర సుమారు మూడు గంట‌ల పాటు సాగింది.

 

 

01 Apr, 2019 0 294
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved