వెల్దుర్తి ప్రమాదం దిగ్భ్రాంతికరం - శ్రీ పవన్ కళ్యాణ్
విభాగం: రాజకీయ వార్తలు
weldhury-road-accident-is-shocking---shri-pawan-kalyan_g2d

కర్నూలు జిల్లా వెల్దుర్తి దగ్గర చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో 15 మంది మృతి చెందారని తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. 

 

గద్వాల జిల్లాకు చెందిన వీరు పెళ్ళి చూపులకు వెళ్లి వస్తుండగా మృత్యువాత పడ్డారని తెలిసి బాధ కలిగింది. ఆ కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలి. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. మితిమీరిన వేగమే 15 మంది ప్రాణాలను హరించింది. ప్రయివేటు బస్సులు అతి వేగంతో వెళ్తున్నా రవాణా శాఖ పట్టించుకోకపోవడం వల్లే ప్రమాదాలు పెరుగుతున్నాయి. రహదారి భద్రత నిబంధనలు కఠినంగా అమలు చేసి, వేగానికి కళ్లెం వేయాలి అని పవన్ కళ్యాణ్ గారు తెలిపారు.

 

 

13 May, 2019 0 398
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved