రఘురామకృష్ణం రాజు ఉద్దేశ్యం ఏమిటి ?
విభాగం: రాజకీయ వార్తలు
what-was-the-purpose-of-raghuram-krishnam-raju_g2d

YSRCP రెబల్ MP గా పేరు తెచ్చుకున్న రఘురామకృష్ణం రాజు తన సొంత పార్టీ పై ఎన్నో విమర్శలు చేశారు. కోవిడ్-19 సంక్షోభం లో జగన్ ప్రభుత్వం మరింత చురుకుగా పని చేయాలి అని పార్టీ MLA లు MP లు కరోనా కట్టడికి ఏ మాత్రం సహకరించడం లేదు అని అన్నారు. ఏదో ఒకటి మాట్లాడుతూ అందరి చూపు తన వైపు ఉండేలా చుసుకూన్తున్నారు.

      తాజాగా రఘురామకృష్ణం రాజు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసి లేఖను ఇచ్చాను అని చెప్పారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసి బయటకు వచ్చిన రఘురామకృష్ణం రాజు మీడియా తో మాట్లాడుతూ రాష్ట్రపతిని ఎందుకు కలవలసి వచ్చింది అనే విషయాన్ని వివరించారు.

      తాను ఇచ్చిన లేఖలో మొదటగా రాజధానిగా అమరావతిని కంటిన్యూ చేయాలని, అమరావతి ఆంధ్రుల రాజధాని అని ఈ రాజధాని గురుంచి ప్రజలు ఎన్నో హక్కులు కలిగి ఉన్నారని, అన్ని ప్రాంతాలకు అనుకూలంగా ఉండటం వలన ఇక్కడ నుంచి ప్రభుత్వాన్ని నడిపించడం మంచిది అని చెప్పారు.అన్ని సౌకర్యాలు అమరావతి లో ఉండగా రాజధానిణి  విశాఖపట్నంకు  ఎందుకు తరలిస్తున్నారో ప్రభుత్వం తెలియజేయాలి అని అన్నారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని, అమరావతి రైతులకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఈ ప్రభుత్వం కొనసాగించాలని కోరారు.    

      అలాగే కేంద్ర బలగాల నుంచి తనకు రక్షణ కావాలి అని  రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కోరారు. అలాగే ప్రజలకోసం ప్రభుత్వం పనిచేయటం లేదు అని, పార్టీకోసం పనిచేస్తుంది అని రాష్ట్రపతి కి వివరించారు. విశాఖ రాజధానిగా అవసరం లేదు అని, విశాఖపట్నం ప్రజలే కోరుతున్నారు అని రాష్ట్రపతి కి వివరించారు.

22 Jul, 2020 0 338
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved