హరీష్ శంకర్ ఏం చేస్తాడు మరి
విభాగం: సినిమా వార్తలు
what-will-harish-shankar-do_g2d

‘దువ్వాడ జగన్నాథం’ సినిమా విడుదలై ఏడాది దాటింది. ఇప్పటిదాకా ఆ చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ తర్వాతి సినిమా మొదలే కాలేదు. ‘డీజే’ నిర్మించిన దిల్ రాజు నిర్మాణంలోనే ‘దాగుడు మూతలు’ అనే మల్టీస్టారర్ మూవీ తీయాలని హరీష్ అనుకున్నాడు. దీని కోసం చాలా నెలలుగా పని చేస్తున్నాడతను. ఇదిగో అదిగో అంటున్నాడు కానీ.. సినిమా సంగతేంటో తేలలేదు. శర్వానంద్, నితిన్ హీరోలుగా నటిస్తారని ప్రచారం జరిగింది. కానీ వాళ్లిద్దరూ ఎవరి ప్రాజెక్టుల్లో వాళ్లు బిజీ అయిపోయారు. దిల్ రాజేమో వేరే సినిమాలతో తీరిక లేకుండా ఉన్నాడు.

మామూలుగా చాలా వేగంగా స్క్రిప్టు రెడీ చేసేస్తాడని హరీష్‌కు పేరుంది. కానీ ‘దాగుడుమూతలు’ విషయంలో మాత్రం ఎటూ తేల్చకుండా ఉన్నాడు. ఫస్ట్ డ్రాఫ్ట్ హరీష్ ఎప్పుడో రెడీ చేశాడని.. కానీ దిల్ రాజు సంతృప్తి చెందకపోవడంతో మార్పలు చేర్పులు చేస్తూ సాగుతున్నాడని.. కానీ ఎంతకీ స్క్రిప్టు ఒక కొలిక్కి రాలేదని.. దిల్ రాజుకు నచ్చట్లేదని అంటున్నారు. తాజాగా దిల్ రాజు మాట్లాడుతూ.. ‘దాగుడు మూతలు’ కథ విషయంలో తర్జన భర్జనలు నడుస్తున్నట్లుగా చెప్పాడు. ఈ సినిమా లేదు అనలేదు. ఉందనీ చెప్పలేదు. మొత్తంగా హరీష్ శంకర్‌ను అయోమయంలోకి నెట్టేశాడు. మధ్యలో దిల్ రాజును కాదని హరీష్ శంకర్ వేరే నిర్మాతను ట్రై చేస్తున్నట్లుగా వార్తలొచ్చాయి.

ఐతే దిల్ రాజు సంతృప్తి చెందని కథను మరో నిర్మాత ఎవరైనా తెరకెక్కించడానికి సిద్ధ పడతాడా అన్నది డౌటు. ఇంకోవైపు హరీష్.. ఈ కథను పక్కన పెట్టేసి మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ రెండో సినిమాను డైరెక్ట్ చేస్తాడన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఐతే ‘విజేత’తో దెబ్బ తిన్న కళ్యాణ్‌ను హరీష్ డైరెక్ట్ చేయాలనుకుంటే అది తన స్థాయిని తగ్గించుకున్నట్లే అవుతుంది. ఈ పరిస్థితుల్లో అతనేం చేస్తాడో.. తన తర్వాతి సినిమాగా దేన్ని ఎప్పుడు పట్టాలెక్కిస్తాడో చూడాలి మరి

 

SOURCE:GULTE.COM

19 Jul, 2018 0 327
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved