ప‌వ‌న్ కూతురు పేరును ఆయ‌న పెట్టార‌ట‌!
విభాగం: రాజకీయ వార్తలు
who-named-pawans-daughter-polina_g2d

కుటుంబ విష‌యాల గురించి పెద్ద‌గా మాట్లాడ‌రు జ‌న‌సేన అధినేత క‌మ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌. సామాజిక అంశాల మీద ఆయ‌న త‌ర‌చూ మాట్లాడ‌తారే కానీ.. వ్య‌క్తిగ‌త విష‌యాల్ని నామ‌మాత్రంగా మాత్ర‌మే చెబుతుంటారు. కొన్ని సంద‌ర్భాల్లో మాత్రం ఇందుకు భిన్నంగా ఆయ‌న ఓపెన్ అవుతూ ఉంటారు.

తాజాగా ఓపెన్ అయిన ప‌వ‌న్‌.. ఆస‌క్తిక‌ర‌మైన ముచ్చ‌ట ఒక‌టి చెప్పారు. త‌న కుమార్తె పోలీనా కు సంబంధించిన ఒక విష‌యాన్ని చెబుతూ.. త‌న కూతురు పేరును ఎవ‌రు పెట్టింది చెప్పారు. అక్క‌డెక్క‌డో ఉన్న సెయింట్ పీట‌ర్స్ బ‌ర్గ్ లోని ఒక క్రిస్టియ‌న్ ఫాద‌ర్ త‌న కుమార్తె పేరును పొలీనా అని పెట్టిన‌ట్లుగా వెల్ల‌డించారు. 

త‌న చిన్న‌ప్పుడు త‌న తండ్రి బైబిల్ కూడా ఇచ్చార‌ని.. అన్ని మ‌తాల్ని స‌మానంగా గౌర‌విస్తూ.. మ‌నస్ఫూర్తిగా గౌర‌వించే సంస్కారం త‌న‌కు ఉన్న‌ట్లు చెప్పారు. 

త‌న‌కు బైబిల్ నుంచి బాగా న‌చ్చింది.. నేర్చుకున్న దాని గురించి చెబుతూ.. త‌న‌ను తాను త‌గ్గించుకున్న వారు హెచ్చింప‌బ‌డుదురు అన్న మాట‌ను తాను తూచా త‌ప్ప‌కుండా పాటిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. తాజాగా భీమ‌వ‌రంలో ప‌ర్య‌టించిన సంద‌ర్భంగా ఒక చ‌ర్చికి వెళ్లి ప్రార్థ‌న‌లు చేశారు. 

ఈ సంద‌ర్భంగా త‌న ఇంట్లోని దేవుడి గ‌దిలో భ‌గ‌వ‌ద్గీత‌తో పాటు.. తన చిన్న‌ప్పుడు త‌న తండ్రి త‌న చేతికి ఇచ్చిన బైబిల్ కూడా ఉంటుంద‌ని చెప్పారు. మొత్తంగా త‌న‌కుబైబిల్ కు ఉన్న సంబంధాలు ప‌వ‌న్ భ‌లేగా చెప్పిన‌ట్లు అనిపించ‌ట్లేదు?

 

SOURCE:GULTE.COM

14 Aug, 2018 0 378
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ 2022 galli2delhi.com All Rights Reserved
@ 2022 galli2delhi.com All Rights Reserved