భోగాపురం కాంట్రాక్టు గుజరాత్ పటేల్ కంపెనీ కి ఎందుకు ?
విభాగం: జనరల్
why-bhogapuram-contract-is-to-gujarat-patel-company_g2d

ఆంధ్ర ప్రదేశ్ 3 రాజధానుల వివాదం ఒక వైపు నడుస్తుంది వైజాగ్ లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టాలి మరోవైపు జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలు గా లెజిస్లేటివ్ క్యాపిటల్ గా అమరావతిని పెట్టాలి అన్నది ప్రభుత్వం నిర్ణయించింది. ఇది ఇలా ఉండగా విశాఖపట్నం , విజయనగరం మధ్యలో ఉన్న భోగాపురం వద్ద క్యాపిటల్ ను నిర్మించాలి అని గవర్నమెంట్ ఎందుకు అనుకుంటుంది?

ఏపీ ప్రభుత్వం చేసిన పనులు కొన్ని సార్లు వర్ణనాతీతంగా ఉంటాయి అని పక్కా ప్రణాళికతో చేస్తున్న కొన్ని పనులు నిరూపిస్తూ ఉంటాయి.  టీడీపీ హయాంలో విజయనగరం జిల్లాలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి 2703 ఎకరాలు సేకరించి జీఎంఆర్ సంస్థకు కాంట్రాక్టు ఇచ్చారు అప్పటికీ వైసిపి ప్రతిపక్షంలో ఉండటంతో అదేపనిగా ఎన్నో ఆరోపణలు చేసింది . తీరా అధికారంలోకి జగన్ ప్రభుత్వం వచ్చాక అదే జీఎంఆర్ కు కాంట్రాక్టు కొనసాగించారు. అలాగే వారికి టిడిపి ప్రభుత్వంలో కేటాయించిన భూమి నుండి 500 ఎకరాలు వెనుకకు తీసుకున్నారు అంటే విమానాశ్రయ నిర్మాణానికి ఆ భూమిని ఇచ్చారు .

జీఎంఆర్ నుంచి తీసుకున్న ఆ ఐదు వందల ఎకరాలను విశాఖ రాజధానిగా అభివృద్ధి చేయాలి అనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది అని మరి కొంతమంది పెద్దలు అంటున్నారు .

విశాఖ రాజధాని ప్రాంతం అంతా కూడా గుజరాత్ రాష్ట్రానికి చెందిన HCP కంపెనీకి ఇచ్చారు . ఇలా కేటాయించిన రాజధాని కంపెనీకి సంబంధించిన అన్ని విషయాలను కూడా ప్రభుత్వం రహస్యంగానే ఉంచింది.  అందుకే భోగాపురం రాజధానిగా మారుతోంది అని రాజ భోగ పురం అవుతుంది అని రాజకీయ పండితులు అంటున్నారు.  అలాగే ఏపీ గవర్నమెంట్ గుజరాత్ పటేల్ కంపెనీ కి విశాఖ రాజధాని డెవలప్మెంట్ ఇవ్వడం అనే జీవో ను ఎందుకు సీక్రెట్ గా ఉంచింది అన్న ప్రశ్నకు మనకు సమాధానం తెలియవలసి ఉంది

23 Jul, 2020 0 495
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
సంబంధిత వార్తలు
అభిప్రాయం
@ 2022 galli2delhi.com All Rights Reserved
@ 2022 galli2delhi.com All Rights Reserved