ఆయ్.. వీర్రాజు.. ఆ మాట మోడీకి చెప్ప‌వే?
విభాగం: రాజకీయ వార్తలు
why-cant-you-demand-modi-to-decrease-10-or-15-rupees-on-fuel_g2d

రాజ‌కీయాల్లో భ‌జ‌న కామ‌న్‌. ఏ స్థాయికి ఆ స్థాయి త‌మకు తోచినంత‌గా భ‌జ‌న చేసుకొని ప్ర‌స‌న్నం చేసుకునే ప్ర‌య‌త్నం చేస్తుంటారు. సర్లే.. పీత క‌ష్టాలు పీత‌వి.. సీత క‌ష్టాలు సీత‌వి.. వీర్రాజు లాంటోళ్ల క‌ష్టాలు వీర్రాజువ‌ని అనుకోవ‌చ్చు. కానీ.. అయ్య‌గారి తెలివి తెల్లారిన‌ట్లుగా మారింది. తాను ప్రాతినిధ్యం వ‌హించే ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల గురించి కించిత్ ఆలోచించ‌ని ఈ పెద్ద‌మ‌నిషి.. నిద్ర లేచిన‌ప్ప‌టి నుంచి ఢిల్లీలో కొలువు తీరిన మోడీ మాష్టారి భ‌జ‌న‌లోనే జీవితాన్ని తెల్లారుస్తుంటారు.

తాను మాట్లాడే మాట‌ల‌కు ప్ర‌త్య‌ర్థి రాజ‌కీయ నేత‌లు విరుచుకుప‌డ‌టాన్ని వ‌దిలేస్తే.. సామాన్య ప్ర‌జ‌ల‌కు సైతం పిచ్చ పిచ్చ‌గా కాలిపోతుంద‌న్న ప్రాధ‌మిక‌మైన విష‌యాన్ని ఆయ‌న ఎందుకు అర్థం కాదో ఎంత ఆలోచించినా అర్థం కాదు. ఎప్పుడూ లేని రీతిలో.. రికార్డు స్థాయిలో .. చ‌రిత్ర‌లో ఇంత‌కు ముందు ఎప్పుడూ లేని రీతిలో లీట‌రు డీజిల్ ధ‌ర ఎన‌భై ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన వేళ‌.. ప్ర‌జ‌లు గ‌రంగ‌రంగా ఉన్నారు. 

పెట్రో ఉత్ప‌త్తుల మీద దండిగా ప‌న్నులు బాదేయ‌టం.. ల‌క్ష‌ల కోట్ల రూపాయిల ప్ర‌జాధనాన్ని బొక్క‌సానికి త‌ర‌లిస్తున్న మోడీ లాంటి పాల‌కుడి మీద విరుచుకుప‌డాల్సింది పోయి.. ఇప్ప‌టికే పీక‌ల్లోతు ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో కొట్టు మిట్టాడుతున్న రాష్ట్ర పాల‌కుల మీద వీర్రాజు లాంటి నేత ఆగ్ర‌హం చూస్తుంటే.. సార్ కి ఏమైంద‌న్న డౌట్ రాక మాన‌దు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్ర ప్ర‌యోజ‌నాల గురించి.. రాష్ట్రానికి కేంద్రం ఇవ్వాల్సిన వాటి గురించి ఎప్పుడూ మాట్లాడ‌ని ఆయ‌న‌.. తాజాగా ఏపీ ముఖ్య‌మంత్రి డీజిల్.. పెట్రోల్ మీద లీట‌రుకు రూ.2 చొప్పున తగ్గించ‌టంపైనా అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు.

ఛీ.. ఛీ.. చీప్ గా లీట‌రుకు రూ.2 ఏంది?  రూ.6చొప్పున త‌గ్గించేయాల‌న్న డిమాండ్‌ను చేసి పారేశారు. మ‌రింత భారీ డిమాండ్‌ను తెర మీద‌కు తెస్తున్న పెద్ద‌మ‌నిషి.. కేంద్రం భారీగా బాదేస్తున్న ప‌న్నుల నుంచి కాస్త రిలీఫ్ తెస్తూ.. లీట‌ర్ కు క‌నీసం రూ.10 నుంచి రూ.15 మ‌ధ్య‌లో త‌గ్గించాల‌న్న డిమాండ్ ఎందుకు చేయ‌రు?  సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ‌లో తాము అధికారంలోకి వ‌స్తే  లీట‌రు పెట్రోల్ రూ.50కు తెస్తామ‌ని క‌మ‌ల‌నాథులు చెప్పిన వైనాన్ని వీర్రాజు మ‌ర్చిపోయినా.. ప్ర‌జ‌లు మ‌ర్చిపోలేద‌న్న‌ది గుర్తిస్తే మంచిది. ఆకాశ‌మే హ‌ద్దుగా బాదేస్తున్న పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌ల్ని త‌గ్గించాల‌ని ప‌రిమిత వ‌న‌రులున్న ఏపీ సీఎం బాబును అడిగే బ‌దులు ప్ర‌ధాని మోడీ మాష్టారిని అడిగితే బాగుంటుంద‌న్న బుద్ది వీర్రాజుకు ఎందుకు రాదంటారు?

 

 

 

SOURCE:GULTE.COM

13 Sep, 2018 0 338
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved