"ఆ" అనే అక్షరం అంటే చిరంజీవికి ఎందుకంత భయం
విభాగం: సినిమా వార్తలు
why-chiranjeevi-is-afraid-of-the-telugu-letter-"aa"_g2d

1978 లో విడుదల అయిన ప్రాణంఖరీదు సినిమాతో మెగాస్టార్ చిరంజీవి సినిమా జీవితం మొదలయింది. అప్పటినుంచి ప్రతీ సంవత్సరo మూడు నుంచి నాలుగు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి వస్తూనే ఉన్నాయి. 2019 లో సైరానరసింహరెడ్డి సినిమా చివరి సినిమా, ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించలేకపోయింది. మళ్ళీ 2021 లో కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య వర్కింగ్ టైటిల్ తో మెగాస్టార్ మళ్ళీ మన ముందుకు రాబోతున్నారు.
              వర్కింగ్ టైటిల్ “ఆచార్య” అని పెట్టినా అది చిరంజీవికి కలిసోస్తుందా లేదా అన్న అనుమానాలు ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి. దీనికి కారణం “అఆ” తో మొదలయిన సినిమా పేర్లు ఇంతకు ముందు ప్రేక్షకులను అలరించలేకపోవడమే. అందులో 1981 లో  K.బాలచంద్ర దర్శకత్వంలో విడుదల అయిన “ఆడవాళ్ళు మీకు జోహార్లు” సినిమాలో చిరంజీవి అతిధి పాత్రలో నటించారు. ఈ సినిమా అప్పటిలో అనుకున్నంత గొప్పగా నిలవలేకపోయింది.మరుసటి సంవత్సరం 1982 లో H.R.భార్గవ్ దర్శకత్వంలో “బంధాలు అనుబంధాలు” విడుదల అయింది. ఇందులో ప్రధాన పాత్రలో చిరంజీవి, శోభన్ బాబు నటించారు.ఈ సినిమా కూడా ప్రేక్షకులను అలరించలేకపోయింది.అలాగే 1983 లో కోడిరామకృష్ణ దర్శకత్వంలో “ఆలయ శిఖరం” విడుదల అయింది. ఇందులో చిరంజీవి, సుమలత ప్రధాన పాత్రలలో నటించారు.ఇది కూడా ప్రేక్షకులను నిరాశపరిచింది.
               అలాగే 1984 లో అల్లుళ్ళు వస్తున్నారు, అగ్నిగుండం, 1987 లో వచ్చిన ఆరాధాన, 2004 లో వచ్చిన అంజి, 2005 లో వచ్చిన అందరివాడు మొదలయిన సినిమాలు ప్రేక్షకులను అలరించలేకపోయాయి.

21 Jul, 2020 0 375
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved