పవన్ ఇన్నిసార్లు ఎందుకు చావాలనుకున్నాడు
విభాగం: రాజకీయ వార్తలు
why-pawan-wanted-to-meet-again_g2d

`పవన్కు ఏదైనా మానసిక సమస్య ఉందా?``...ఇదేదో మాకు వచ్చిన సమస్య అనుకోకండి. జనసేన పార్టీ అధ్యక్షుడి గురించి నెటిజన్లు - పలువురు సామన్య ప్రజలు వ్యక్తం చేస్తున్న సందేహం ఇది! ఎందుకు ఇలాంటి సందేహం వచ్చిందంటే...పవన్ తాజాగా చేసిన ప్రకటన వల్ల. ఔను. తాజాగా పవన్ ఓ సంచలన ప్రకటన చేశారు. తనకు పిస్తోల్ తో కాల్చుకొని చావాలని అనిపించిందని ఆయన వెల్లడించారు. అయితే అది ఇప్పుడు కాదు. యువకుడిగా ఉన్న సమయంలోనట. పవన్ ఇలాంటి సంచలన ప్రకటన చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఒకట్రెండు సందర్భాల్లో ఈ మాటే చెప్పారు. అందుకే...పవన్ పై నెటిజన్లు ఈ కొత్త సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

యువకుడిగా ఉన్నప్పుడు మొదటిసారిగా తుపాకితో కాల్చుకోవాలని అనిపించిందని పవన్ వెల్లడించారు. తను యువకుడిగా ఉన్న సమయంలో ఓ మహిళకు సంబంధించి సమస్య తన ముందుకు రాగా...అప్పుడు తుపాకితో కాల్చుకునేందుకు పవన్ సిద్ధమైపోయారట. తుపాకిలో బుల్లెట్లు లోడ్ చేసుకున్న పవన్ కాల్చుకునేందుకు రెడీ అయిపోయిన సమయంలో ఆయన కుటుంబ సభ్యులు రక్షించారట. అనంతరం తన సోదరులు - వదినలు తనకు మార్గదర్శనం చేశారని పవన్ తన భావోద్వేగాన్ని పంచుకున్నారు. `పంజా` సినిమా సమయంలో రెండో సారి కాల్చుకోవాలని అనిపించిందని జనసేనాని వెల్లడించారు. వరుస వైఫల్యాలతో కుదేలయిపోతున్న సమయంలో జీవితం ముగించాలని భావించానని అయితే తనంత తానుగా జీవితం గురించి విశ్లేషించుకొని బయటపడ్డానని వెల్లడించారు.

పవన్ వెల్లడించిన ఈ విషయాలు ఆసక్తికరంగా ఉండటంతో పాటుగా అనేక అనుమానాలను సైతం కలిగిస్తున్నాయని పలువురు చర్చించుకుంటున్నారు. ఈ కామెంట్ల ద్వారా పవన్ డిప్రెషన్ లో ఉన్న విషయం స్పష్టమైందని చెప్తున్నారు. తాజాగా పలువురు పార్టీలో చేరిన సందర్భంగా పవన్ మాట్లాడుతూ ``ఈ రాష్ట్రాన్ని 40 ఏళ్లు కాంగ్రెస్ - 20 ఏళ్లు టీడీపీ పాలించాయి. ఈసారి జనసేనకు అవకాశం ఇవ్వాలి. రాజకీయాన్ని చాలా బాధ్యతతో చేస్తా`అని హామీ ఇచ్చారు. ఇలాంటి మాటలు చెప్తున్న పవన్ తనకు ఇంత భావోద్వేగ సమస్యలు ఉన్న విషయం పంచుకోవడం వల్ల ఆయన నాయకత్వ శైలిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సినిమాల్లో వైఫల్యం - ఒక వ్యక్తికి సంబంధించిన అంశంపైనే కాల్చుకొని చనిపోవాలని భావించిన వ్యక్తి...భవిష్యత్తులో నాయకుడై రాష్ర్టాన్ని పరిపాలిస్తే...అప్పుడు ఎదుర్కునే సమస్యలకు ఎలా రియక్టవుతారు? ఎన్నో సవాళ్లు - ఎత్తుగడలు - ఒక్కోసారి కుట్రలు కూడా ఎదుర్కుకోవాల్సినపుడు పవన్ ఇదే భావనతో ఉంటే పరిస్థితి ఏంటి అనేది నెటిజన్లు వేస్తున్న ప్రశ్న

 

SOURCE:TUPAKI.COM

28 Jul, 2018 0 351
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved