నంద్యాలలో కరోనాతో భార్య, భర్తలు మృతి
విభాగం: జనరల్
wife-and-husband-die-with-corona-in-nandyal_g2d

 ఆంధ్రప్రదేశ్ లో కరోనా విలయతాండవం చేస్తుంది.రోజు రోజూకూ మరణాల సంఖ్య పెరుగుతుంది. అలాగే కేసుల సంఖ్య కూడా ఊహించన దాని కంటే రెట్టింపు సంఖ్య లో వస్తున్నాయి. దీనితో ఆంధ్రప్రదేశ్ ప్రజలు భయాందోళనలతో జీవితాన్ని గడపవలసి వస్తంది.

      కర్నూలు జిల్లా నంద్యాలలో డిహెచ్ఎంఎస్ వైద్యుడి కుటుంబంలో కరోనా విషాదం చోటుచేసుకుంది. ఇంటిలో ఉండే ముగ్గురుకు కరోనా పాజిటివ్ రావడంతో నంద్యాలలో ఉన్నతాధికారులు మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.

      స్థానిక నంద్యాలలోని గాంధీ చౌక సమీపంలో హోమియోపతి వైద్యుడిగా ఉంటున్న డాక్టర్ వీజికె వంకదార గురుక్రిష్ణమూర్తి (72), ఆయన భార్య సుజాతమ్మ(70) కరోనాతో పోరాడలేక మరణించారు.

      మొదటగా భార్యకు పాజిటివ్ రావడంతో ఆసుపత్రికి తరలించారు.తరువాత భర్తను కూడా తరలించారు భార్య కరోనాతో పోరాడలేక మరణించింది.  ఈ విషయం తెలిసిన భర్త కూడా మరణించాడు. వీళ్ళకు ఒక కొడుకు ఉండడంతో, కొడుకుకి కూడా కరోనా పాజిటివ్ రావడంతో అతను కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

      నంద్యాలలో ఒకేసారి ఒకే కుటుంబంలో రెండు మరణాలు రావడంతో నంద్యాల ప్రజలు కరోనాతో భయపడుతున్నారు. కరోనాను మరింత కట్టుదిట్టంగా నియత్రించడానికి ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

22 Jul, 2020 0 171
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
సంబంధిత వార్తలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved