చిత్రపరిశ్రమ యానిమేషన్ చిత్రపరిశ్రమగా మారనుందా?
విభాగం: సినిమా వార్తలు
will-the-film-industry-changes-to-animation-film-industry_g2d

కరోనా మహమ్మారి మానవ జీవితంలో ఎన్నో మార్పులు తీసుకువచ్చింది.ఆ మార్పులో చిత్రపరిశ్రమ కూడా బాగంగా ఉంది.కరోనా మహమ్మారి తీవ్రత ఎక్కువైన నుండి షూటిoగ్స్ బంద్ అయ్యాయి. సినిమా థియేటర్లు కూడా బంద్ అయ్యాయి.దీని వల్ల సినిమాలను డైరెక్టర్లు ఓటిటి లో రిలీజ్ చేస్తున్నారు.ఇలా ఓటిటి లో సినిమా రిలీజ్ చెయ్యడం తెలుగు చిత్రపరిశ్రమకు కొత్త. ఓటిటి లో రిలీజ్ చేస్తే సినిమాకి పెట్టిన పెట్టుబడులు వస్తాయో రావో అన్నది మరొక ప్రశ్న, పోని కొన్ని షరతులతో షూటిoగ్ లకు  ప్రభుత్వం అనుమతి ఇచ్చినా కూడా పెద్ద హీరో సినిమాలకు టెక్నిషియన్స్ ఎక్కువగా కావలసి ఉంటుంది.అలాగే వీళ్ళకు ఇచ్చే జీతాలు వల్ల ప్రొడ్యూసర్స్ కూడా అప్పుల పాలు అవ్వల్సిందే అంటున్నారు కొంతమంది సినిమా పిచ్చోళ్ళు .
      ఇంత కష్టపడి సినిమా తీసాక  ఓటిటి లో రిలీజ్ చేయాలి. దీనివలన పెట్టిన పెట్టుబడులు వెనక్కి రాబట్టడంలో ఫెయిల్ అయితే ప్రొడ్యూసర్లు నష్టపోతారు.అందువలన యాక్టర్స్ తో సంబంధం లేకుండా యానిమేషన్ ద్వారా మాత్రమే సినిమాను నిర్మించాలి అని కొంతమంది ప్రొడ్యూసర్స్ మధ్య చర్చలు జరుగుతున్నాయి అందులో మొదటగా DVV దానయ్య, దిల్ రాజు, సురేష్ బాబు ఉన్నట్లు సమాచారం.
       యానిమేషన్ సినిమాలలో ఇన్ డోర్ , అవుట్ డోర్ షూటిoగులు ఏమీ ఉండవు. దీనివలన సినిమాకు డబ్బులు పెట్టె ప్రొడ్యూసర్లు చాలా వరకు డబ్బులు ఆదా అవుతాయి. అలాగే ఇటువంటి సినిమాకు వాయిస్ ఓవర్ ఇస్తే సరిపోతుంది.ఇటువంటి సినిమాలను ఓటిటి ఫ్లాట్ ఫామ్ లలో కూడా సులభంగా విడుదల చేయవచ్చు అని నిర్మాత మండలి అన్నట్లు సమాచారం.

22 Jul, 2020 0 353
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved