ఆంధ్రాలో అరాచకం మాస్క్ లేకపోతే పోలీసులు చంపేస్తారా
విభాగం: జనరల్
will-the-police-kill-if-there-is-no-mask-in-andhra_g2d

చీరాలలోని థామస్ పేట కు చెందిన యాచి చార్ల కిరణ్ కుమార్ అనే వ్యక్తి లాక్ డౌన్ కారణంగా హైదరాబాద్ నుండి తన ఊరికి వచ్చాడు.జూలై 18న తన స్నేహితుడు అయిన షైనీ అబ్రహం తో కలిసి చీరాల వెళుతుండగా కొత్తపేట చెక్ పోస్ట్ వద్ద పోలీసులు అతనిని ఆపి మాస్క్ లేకుండా తిరుగుతున్నాడని చితకబాదడం తో అతను స్పృహ కోల్పోయాడు వెంటనే కిరణ్ కుమార్ ను దగ్గర్లో ఉన్న చీరాల ఆసుపత్రికి తీసుకు వెళ్లగా దెబ్బలను తట్టుకోలేని కిరణ్ కుమార్ రెండు రోజులక తరువాత చనిపోయాడు. 

ఈ విషయాన్ని తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ విచారణకు ఆదేశించారు అలాగే మృతుడి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. 
చీరాల ఘటనపై ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ మాట్లాడుతూ ఈ సంఘటన కు ముఖ్య కారకుడు అయిన చీరాల టూ టౌన్ ఎస్ఐ విజయ్ కుమార్ పై వేటు పడింది. ఎస్ ఐ ను మరో చోటికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశాము అని తెలియజేశారు

23 Jul, 2020 0 439
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
సంబంధిత వార్తలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved