అమెరికా ఎన్నికలలో ట్రంప్ గెలుస్తారా
విభాగం: రాజకీయ వార్తలు
will-trump-win-the-us-election_g2d

అమెరికా కుబేరుడు ఇప్పటి అధ్యక్షుడు ట్రంప్  ఎన్నికలలో గెలిచి మళ్ళీ అధ్యక్షుడుగా ప్రమాణ స్వీకారం చేస్తారా అనే ప్రశ్నకు అమెరికా యువత, ట్రంప్ ఎన్నికలలో గెలవలేరు అని సమాధానం చెబుతున్నారు.
దీనికి కారణం అధ్యక్షుడు ట్రంప్  పై డెమోక్రటిక్ ప్రెసిడెంట్ అభ్యర్ధి జోబిడెన్ ప్రత్యర్ధిగా పోటీ చేయడమే, అమెరికా లో విడుదల అయిన కీలక సర్వేలు జోబిడెన్ వైపు మొగ్గు చూపుతున్నాయి.
యువత, ,మధ్యవయస్కులు,ఉద్యోగస్తులు ఎక్కువగా జోబిడెన్ నాయకత్వాన్ని సమర్ధిస్తూ సోషల్ మీడియా లో పోస్టింగులు పెడుతున్నారు.అలాగే  అధ్యక్షుడు ట్రంప్  కాన్ఫెడరేట్ జెండాను సమర్ధిస్తూ జోబిడెన్ కార్యాలయ భవనాలను కించపరిచే విధంగా మాట్లాడటం కూడా ఒక కారణం.
అలాగే బిడెన్ స్వస్థలమైన విల్లింగ్టన్ డెల్ లో మాట్లాడుతూ, ఆందోళన కరమైన భయం అమెరికన్ ప్రజలలో పోవాలి అలాగే COVID-19 కేసుల విషయంలో ట్రంప్ ప్రభుత్వం ఎలా వైఫల్యం అయింది వివరించారు. అలాగే మన దేశ అధ్యక్షుడు ట్రంప్  వల్ల సంక్షోభం లో ఉన్నాము అని తెలిపారు.
అలాగే COVID-19 మహమ్మారిని ఎలా ఎదుర్కోవాలో వివరించారు. అలాగే మౌలిక సదుపాయాలు, ఉద్యోగాలు గుర్తిసూ తన ప్రణాళికను వివరించారు. జోబిడెన్, అధ్యక్షుడు ట్రంప్  లాగ కనిపించరు. సమస్యలను ఎలా పరిష్కరించాలి అన్నది మాత్రం వివరిస్తారు అని అమెరికన్ యువత అంటున్నారు. సమస్యను పరిష్కరించే మార్గాలును జోబిడెన్ ఒక నిర్ణయాత్మక ధోరణిలో పోతున్నారు అన్నది అమెరికన్ యువత నమ్ముతున్నారు.సమస్యను పరిష్కరించే ఈ మార్గమే జోబిడెన్ ను అధ్యక్షుడుగా చేస్తుంది అంటూ సోషల్ మీడియాలో పోస్టింగులు పెడుతున్నారు యువత.

21 Jul, 2020 0 257
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved