విషం తాగిన వైసీపి మహిళా నేత
విభాగం: రాజకీయ వార్తలు
ycp-women-leader-took-poison_g2d

వైసీపి నేత మాల మహానాడు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జోని కుమారి మీడియా కాన్ఫెరెన్స్ నిర్వహిస్తూ తనకు జరిగిన అన్యాయాన్ని తెలియజేస్తూ, నేను ఎంతోమంది పెద్దల చేతులలో మోసపోయాను. పార్టీలో నాకు విలువ, మర్యాదలు లేవు. ఇదే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ గారికి తెలియజేద్దమనుకున్నాను కానీ కరోనా కారణముతో ముఖ్యమంత్రిని కలువలేకపోయాను.కానీ పార్టీ ముఖ్యనేత విజయసాయిరెడ్డిని ఈ నెల 6న కలిసి నా భాదను వెల్లడించినా నాకు న్యాయం జరగలేదు. అని వెల్లడిస్తూ విషం తీసుకున్నారు. ప్రక్కనే ఉన్న పోలీసులు వెంటనే స్పందించి నగరంలో ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈమె మాలమహానాడు మహిళా విభాగం అధ్యక్షురాలు కూడా అవ్వడంతో ఈ వ్యవహారం పార్టీలో చర్చకు దారితీసింది.

    జోని కుమారి భర్త స్పందిస్తూ పార్టీతో గాని, ముఖ్య నేతలతో గాని ఇప్పటిదాకా ఎటువంటి సమస్యలు రాలేదు అని వివరించారు. అలాగే వైసీపి నుంచి ఎటువంటి సమస్యలు లేవని కరోనా సమయంలో ముఖ్యమంత్రిని కలవడం కుదరదు అని తెలియజేస్తూ బహుశా మాలమహానాడు లో ఏదైనా సమస్యలు ఉండవచ్చు కాని, పార్టీ ముఖ్యనేతలతో మాకు ఎటువంటి సమస్యలు లేవని వివరించారు.

      మరోవైపు TDP నాయకులు మాట్లాడుతూ జోని కుమారి ఆత్మహత్యయత్నం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. పార్టీలో పనిచేసిన ఒక మహిళా ముఖ్యనేతకే ఇన్ని సమస్యలు ఉంటె ఆ సమస్యను పట్టించుకోని ముఖ్యమంత్రి రాష్ట్ర మహిళలకు ఎటువంటి భద్రత కల్పించగలరని విమర్శించారు. TDP నాయకులు మాటలను ఖండిస్తూ YCP నాయకులు జోని కుమారి, TDP నియమించిన పెయిడ్ ఆర్టిస్ట్ అంటూ విమర్శించారు.

22 Jul, 2020 0 297
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved